అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌

ABN , First Publish Date - 2023-03-19T23:23:41+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి రాగానే పేద ప్రజలకు గ్యాస్‌ సిలిండర్‌ ధరను పూర్తిగా తగ్గించి రూ.500కే అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ గోవా రాష్ట్రం పీసీసీ మాజీ అధ్య క్షుడు, హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ఇన్‌చార్జి గిరిష్‌ చోడాంకర్‌ అన్నారు.

అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
పోతులమడుగులో మాట్లాడుతున్న రాష్ట్ర ఇన్‌చార్జి గిరిష్‌ చోడాంకర్‌

- గోవా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గిరిష్‌ చోడాంకర్‌

- కొనసాగిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

భూత్పూర్‌, మార్చి 19 : కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి రాగానే పేద ప్రజలకు గ్యాస్‌ సిలిండర్‌ ధరను పూర్తిగా తగ్గించి రూ.500కే అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ గోవా రాష్ట్రం పీసీసీ మాజీ అధ్య క్షుడు, హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ఇన్‌చార్జి గిరిష్‌ చోడాంకర్‌ అన్నారు. ఆదివారం మండలం లోని పోతు లమడుగు, గోపన్నపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూ దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇల్లిల్లూ తిరుగుతూ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. పోతులమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో గిరిష్‌ చోడాంకర్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం పేదల సొమ్మును దోచి అదానికి, అంబానికి కట్టబె డుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఖాతాల్లో జన్‌ధన్‌ పేరున రూ.15లక్షలు వేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకురుణ మాఫీ చేయకుండా రైతులను దగా చేస్తున్నదని ఆయన విమర్శించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మోసాలు చేసి పాలిస్తున్నారని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించ డంలో పూర్తిగా విఫలమైందన్నారు. పేరుకే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అని, ఎక్కడా నిరుపేదలకు దక్కలే దని విమర్శించారు. అనంతరం గ్రామంలోని అం బేడ్కర్‌ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టి బొమ్మను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దహనం చే శారు. టీఎస్‌పీసీని వెంటనే రద్దు చేయాలని నినా దాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యద ర్శి కాటం ప్రదీప్‌ కుమార్‌గౌడ్‌, టీపీసీసీ ఉపాధ్య క్షుడు జగదీశ్వర్‌రావు, టీపీసీసీ కార్యదర్శి సంజీవ్‌ ముదిరాజ్‌, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటన ర్సింహారెడ్డి, కురుమూర్తి దేవస్థానం మాజీ చైర్మన్‌ రాధాకృష్ణారెడ్డి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎండీ సాదిక్‌, ఓబీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌, జిల్లా నాయకుడు బెనహర్‌, మాజీ సర్పంచ్‌ హర్యానాయక్‌, ఎంపీటీసీ ఊశన్న, మాజీ వైస్‌ ఎంపీపీ పాలరాములు, గోవర్ధన్‌గౌడ్‌, మైనార్టీ నాయకుడు అబుబాకర్‌, లిక్కి నవీన్‌గౌడ్‌, లిక్కి విజయ్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T23:23:41+05:30 IST