టికెట్లు ప్రకటిస్తే సంబురాలు విడ్డూరం
ABN , First Publish Date - 2023-08-22T23:33:29+05:30 IST
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటిస్తే బీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు22: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటిస్తే బీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, కూచకుళ్ల రాజేష్‌రెడ్డితో కలిసి వంశీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్ల కెటాయింపుకే బీఆర్‌ఎస్ నాయకుల సంబురాలు చూస్తుంటే ఇన్నాళ్లు వారి ఎమ్మెల్యే పని తీరుతో టికెట్లు రావని అపనమ్మకంతో ఉన్నట్లు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని, ఆ సభకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు తిమ్మాజిపేట పాండు, ఐతోలు లక్ష్మయ్య, కోటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కొడిదెల రాము, తైలి శ్రీనివాసులు, కౌన్సిలర్లు కావలి శ్రీనివాసులు, సునేంద్ర, ఎండీ.నిజాముద్దీన్ పాల్గొన్నారు.
ఫ కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మైనార్టీ నాయకుడు
బీజేపీ జిల్లా నాయకుడు యూసుఫ్ ఉల్ ఘనీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ యూసుఫ్ ఉల్ ఘనీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.