ఇక్కడి సమస్యలు నాకు బాగా తెలుసు
ABN , First Publish Date - 2023-07-14T23:44:41+05:30 IST
ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు అలంపూర్ సమస్యలు బాగా తెలుసునని, అమెరికాలో ఉన్నోళ్లకు ఇవి ఎలా తెలుస్తాయని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.
- అమెరికాలో ఉన్నోళ్లకెలా తెలుస్తాయి
- అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం
ఎర్రవల్లి చౌరస్తా/ అయిజ టౌన్, జూలై 14 : ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు అలంపూర్ సమస్యలు బాగా తెలుసునని, అమెరికాలో ఉన్నోళ్లకు ఇవి ఎలా తెలుస్తాయని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. రూ.30 లక్షల వ్యయంతో ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురంలో సీసీ రోడ్డు, బీసీ కమిటీ హల్, ఎర్రవల్లి బెటాలియన్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు మంచి చేయడమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు నాగేశ్వరి, జయచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సుంకన్న, రాముడు, ఈదన్న, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు యుగంధర్‌రెడ్డి, రాగన్న, వేణునాయుడు, కృష్ణసాగర్, రాముడు, ప్రభుదాస్, పీఅర్‌ఏఈ పాండురంగ పాల్గొన్నారు.
పార్టీలో సైనికుడిలా పని చేస్తా
బీఆర్‌ఎస్ పార్టీలో సైనికుడిలా పని చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. అయిజ మునిసిపాలిటీలోని 12వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయిజ పట్టణంలో ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. అనంతరం రూ.1.50 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ఇచ్చారు. ఆ తర్వాత భీమరామస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయంలో షెడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.