పాలమూరులోనే ఉన్నత విద్య అవకాశాలు
ABN , First Publish Date - 2023-08-28T23:17:41+05:30 IST
ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి డిగ్రీలు పొందిన ప్ర తీ ఎంబీబీఎస్ విద్యార్థి పీజీ, సూపర్ స్పెషాలిటీ వంటి ఉన్నత వైద్యవిద్యను అభ్యసించేందుకు పాలమూరులోనే అవకాశాలు కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- గ్రామీణ నిరుపేదలకు సేవ చేసేందుకు వైద్య విద్యార్థులు ముందుకు రావాలి
- జిల్లాను మెడికల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి
- ప్రభుత్వ వైద్య కళాశాల రెండవ స్నాతకోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం), ఆగస్టు 28 : ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి డిగ్రీలు పొందిన ప్ర తీ ఎంబీబీఎస్ విద్యార్థి పీజీ, సూపర్ స్పెషాలిటీ వంటి ఉన్నత వైద్యవిద్యను అభ్యసించేందుకు పాలమూరులోనే అవకాశాలు కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమ వారం ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన ప్రతీ విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని, స్వచ్చం దంగా సేవ చేసేందుకు ముందుకు రావాలని సూచిం చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి వైద్య కళాశాల పాలమూరుకే దక్కిందని, జిల్లాకు నర్సింగ్ కళాశాలను కూడా తెప్పించామని, అంతేకాకుండా రూ.500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నామని, త్వరలో అది పూర్త యి ఉమ్మడి జిల్లా ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేకుండా అన్ని వైద్య సేవలు పాలమూరులోనే అందిం చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ను మెడికల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్‌లో ఎయిర్‌పోర్టు నుంచి మహ బూబ్‌నగర్‌కు త్వరగా వచ్చేలా మెట్రో ట్రైన్‌ను పొడిగిం చేందుకు కూడా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి వారం రోజుల్లో రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ప్రభు త్వ వైద్య కళాశాల ఆడిటోరియం నిర్మాణానికి ప్రతి పాదనలు సమర్పించాలని, త్వరలోనే దానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సంద ర్భంగా విద్యార్థులకు వైద్యపట్టాలను అందజేశారు. కార్య క్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, అకాడమిక్ ప్రిన్సిపల్ డాక్టర్ నవకళ్యాణి, వైస్ ప్రి న్సిపల్ డాక్టర్ నావల్ కిశోర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాద రావు, డాక్టర్ విజయ్ ఎల్దండి తదితరులు పాల్గొన్నారు.