మార్కెట్‌కు భారీగా వేరుశనగ
ABN , First Publish Date - 2023-04-03T23:29:34+05:30 IST
గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వేరుశనగ పంట భారీగా విక్రయానికి వచ్చింది.
- క్వింటాలు ధర గరిష్ఠం రూ.7,240
గద్వాల, ఏప్రిల్ 3 : గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వేరుశనగ పంట భారీగా విక్రయానికి వచ్చింది. ప్రతీ రోజు మూడు వేల క్వింటాళ్లకు తక్కువ కాకుండా వస్తుండటంతో రైతులతో మార్కెట్ సందడిగా ఉంది. సోమవారం 4,105 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్ఠంగా క్వింటాలుకు రూ.7,240ల ధర పలికింది. కనిష్ఠంగా రూ.4,249 పలకగా, మోడల్ ధర రూ.5,769గా ఉంది. ఆముదం 1,100ల క్వింటాళ్లు రాగా, క్వింటాలుకు గరిష్ఠం రూ.5,903, కనిష్ఠం రూ.3,829 ధర పలికింది. మోడల్ ధర రూ.5,720 ఉంది. సోనామసూరి ధాన్యం 245 క్వింటాళ్లు వచ్చింది. గరిష్ఠం రూ.2,249, కనిష్ఠం రూ.2,219 ధర పలికింది.