ఘనంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి జన్మదినం
ABN , First Publish Date - 2023-09-21T23:35:53+05:30 IST
ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదపండితులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులను ఆశీర్వదించారు.

- ఆశీర్వదించిన వేదపండితులు, పాస్టర్లు
- ఎమ్మెల్యే దంపతులకు గజమాలతో ఘన సన్మానం
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 21 : ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదపండితులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. జిల్లాలోని పాస్టర్లు ఆయనను దీవించారు. మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేఢుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు గజమాల వేసి ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మునిసిపల్ కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కల్యాణలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్ధానం ట్రస్ట్ చైర్మన్, సభ్యులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి, శ్రీవారి కండువా, కల్యాణ చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, మరిడి శ్రీకాంత్, షీలా అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
ధరూరు : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ధరూరు మండలంలోని ర్యాలంపాడు గట్టుపై గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అర్చన చేయించారు. అనంతరం 101 కొబ్బరి కాయలను సమర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, మాణిక్య రెడ్డి, వెంకట్రామి రెడ్డి, నరసింహులు గౌడ్, రంగారెడ్డి, సర్పంచులు అంపన్న, తిమ్మప్ప, ధరూరు మండల యూత్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, లక్ష్మన్న, రంగన్న గౌడ్, రాముడు, నర్సింహులు, భీమా, నవీన్, నాగరాజు, సురేస్, తిమ్మప్ప, బాలు, రవీంద్ర పాల్గొన్నారు.