గ్రూప్-1 పరీక్షలు సజావుగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-06-07T23:59:22+05:30 IST
గ్రూప్-1 పరీక్షలను సజా వుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, జూన్ 7 : గ్రూప్-1 పరీక్షలను సజా వుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. గ్రూప్-1 పరీక్షలపై కలెక్టర్ సమావేశపు హాలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 11న, ఆదివారం ఉదయం 10.30 నుంచి 1.00 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్ధులు ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 10.15 నిమిషాలకు పరీక్ష హాల్‌లోకి వెళ్లాలన్నారు. 10.30 తర్వాత ఎవరినీ అనుమతించేంది లేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికా రులను ఆదేశించారు. పరీక్ష హాలులో గైర్హాజరైన విద్యార్ధుల సీట్లలో కేవలం ప్రశ్నపత్రాన్ని మాత్రమే ఉంచాలన్నారు. అభ్యర్ధులు షూస్ వేసుకోవద్దని, వాచ్, ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. ఓఏంఆర్ షీట్‌పై హాల్‌టికెట్ నంబర్, క్వశ్చన్ బుక్‌లెట్ నెంబర్ రాయాలని, ఈ విషయంపై అభ్యర్థులకు అవ గాహన కల్పించాలని చెప్పారు. రూట్ అఽధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైసెన్ అధికారులు సమన్వయం చేసుకొని పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ఓఎంఆర్ షీట్‌లను పరీక్ష అనంతరం రెడ్ పాలిథిన్ కవర్లో ఉంచి సీల్ వేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు. ఇతర వసతులు కల్పించాలని చెప్పారు. కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్డీవో రాములు, డీఎస్పీ రంగస్వామి, అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా లబ్ధిదారుల గుర్తింపు
బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపును పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. రెండవ విడత గొర్రెల పంపిణీల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బుధవారం సంగారెడ్డి నుంచి ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హారీశ్‌రావు, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీ కుల, చేతి వృత్తిదారులకు లక్ష రూపాయల సాయం అందించేం దుకు చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మట్లాడుతూ బీసీ కులవృత్తులు, చేతివృత్తులు వారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం కార్యక్రమాన్ని జూన్ తొమ్మిదిన ముఖ్య మంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపా రు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా సహాయం అందించాలన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జూన్ తొమ్మిదిన నిర్వహించే సంక్షేమ సంబురాల్లో బీసీ కుల వృత్తుల వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీకి లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాలలో యూ నిట్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 14న నిర్వహించనున్న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్వేతాప్రియదర్శిని, అధికారులు పాల్గొన్నారు.