Share News

ప్రజల వద్దకే పాలన

ABN , Publish Date - Dec 30 , 2023 | 10:58 PM

సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే మా పాలన ఉంటుందని ఎమ్మెల్మే వంశీకృష్ణ అన్నారు.

 ప్రజల వద్దకే పాలన
ప్రజావాణిలో సమస్యలను వింటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, డిసెంబరు 30: సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే మా పాలన ఉంటుందని ఎమ్మెల్మే వంశీకృష్ణ అన్నారు. ప్రజావాణిలో భాగంగా శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రజా భవన్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్మే స్వయంగా వారి సమస్యలను వింటూ సంబంధిత శాఖ అధికారులకు అక్కడి నుంచే సమస్యలను వివరించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలివచ్చారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్‌ థెరిస్సా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్‌ థెరిస్సా సేవలను ఆయన కొనియాడుతూ ఆమె గురించి విద్యార్థులకు వివరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్మించిన గదులేనని, అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరాయన్నారు. గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అచ్చంపేట దోపిడీకి గురైందన్నారు. శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి కొత్తగా గదులను నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి, అమ్రాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు డాక్టర్‌ అనురాధ జన్మదినోత్సవం సందర్భంగా కళాశాలలో కేక్‌ కట్‌ చేశారు. కౌన్సిలర్లు గౌరీశంకర్‌, సునీత తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 10:58 PM