అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2023-01-24T23:28:32+05:30 IST

తాళాలు వేసిన షట్టర్లు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అపూర్వారావు తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అపూర్వారావు, వెనుక నిందితులు (ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తులు)

- ఆరుగురి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

వనపర్తి అర్బన్‌, జనవరి 24 : తాళాలు వేసిన షట్టర్లు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అపూర్వారావు తెలిపారు. మంగళవారం వనపర్తి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ విలేకర్ల సమావేశం నిర్వ హించి, వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తోమాలపల్లి వద్ద పెబ్బేరు ఎస్సై రామస్వామి, సీసీఎస్‌ పోలీస్‌ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఓ టవేరా వాహనాన్ని నిలిపి వివరాలడగగా అందులో ఉన్న మహారాష్ట్రకు చెం దిన ఆరుగురు వ్యక్తులు పొంతన లేని సమా ధానాలు చెబుతుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాజుశంకర్‌ కాలే, విజయ్‌ రామకాలే, గణపతి శివాజీకాలే, సంజీవ్‌ ఉమ్మజీపవర్‌, సయుం సలీం షేక్‌అంబదాస్‌, రామచంద్ర అనే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు షట్టర్లు వేసిన తాళాలు పగులకొట్టి దొంగతనాలకు పాల్ప డుతున్నట్లు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరిం చారు. వీరు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో ఇప్పటివరకు 30కి పైగా చోరీలు చేశారన్నారు. వనపర్తి జిల్లాలో 2022 సెప్టెంబరు 11వ తేదీన పెబ్బేరు పట్టణంలో లక్ష్మిదుర్గ హార్వె స్టర్‌ దుకాణానికి సంబంధించిన షట్టర్లు పగుల కొట్టి రూ.14వేల నగదును, అక్కడే సమీపంలో ఉన్న మరో బాలాజీ హోంనీడ్స్‌ షట్టర్‌ తాళాలు పగులకొట్టి వెయ్యి రూపాయల నగదు ఎత్తుకెళ్లి నట్లు చెప్పారు. అదేవిధంగా 2022 డిసెంబర్‌ 4వ తేదీన చిన్నంబావి మండల పరిధి లోని మహా లక్ష్మి వైన్‌షాప్‌ తాళాలు పగులకొట్టి రూ.96వేల నగదును ఎత్తుకెళ్లినట్లు వివరించారు. వీరు ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, కల్వకుర్తి, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌, సీసీ కుంట ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి ఒక టవేరా వాహనంతో పాటు, దొంగతనానికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి నట్లు ఎస్పీ తెలిపారు. కేసును చేధించిన అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీని వాసాచారి, ఎస్సై రిషికేష్‌, అంజద్‌, పెబ్బేరు ఎస్సై రామస్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, తిరుపతి రెడ్డి, సమరసింహారెడ్డి, ఐటీ సెల్‌ పోలీస్‌ కానిస్టే బుల్‌ మురళి, గోవింద్‌, రవి, మల్లికార్జున్‌లను ఎస్పీ అభినందించారు.

Updated Date - 2023-01-24T23:28:32+05:30 IST