మండలం మరింత అభివృద్ధి

ABN , First Publish Date - 2023-03-19T23:15:35+05:30 IST

మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మండలం మరింత అభివృద్ధి
హన్వాడ మండలం నాయినోనిపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

- కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

హన్వాడ, మార్చి 19 : మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హన్వాడ ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను, నాయినో నిపల్లి, ఇబ్రహింబాద్‌ గ్రామాలలో సీసీ రోడ్లు, తిరుమలగిరిలో ముదిరాజ్‌ భవనాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం ప్రారంభించారు. 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందిం చారు. నాయినోనిపల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో సీసీరోడ్లు, ఇబ్రహింబా ద్‌లో రూ. 25 లక్షలతో సీసీరోడ్లు, తిరుమలగిరిలో రూ. 15 లక్షలతో నిర్మించిన ముదిరాజ్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 8 సంవత్సరాలలో రూ. 292 కోట్లతో మండలాన్ని అఽబివృద్ధి చేసినట్లు తెలిపారు. మండలానికి బైపాస్‌ రహదారి, ఐటీ పార్కు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి రానుందని తెలిపారు. తిరుమలగిరిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వసం త, చిన్నచెన్నయ్య, గిరిజమ్మ, రేవతి, ఎంపీటీసీ పెద్దచెన్నయ్య, సత్యమ్మ, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, వైస్‌ ఎంపీపీ లక్ష్మి, నాయ కులు కొండ లక్ష్మయ్య, నరేందర్‌, కృష్ణయ్యగౌడ్‌, జిల్లా కోఆప్షన్‌ అన్వర్‌, యాదయ్య, శ్రీను, జంబులయ్య పాల్గొన్నారు. హన్వాడలో సెర్పు ఉద్యోగు లకు పేస్కేల్‌ అమలు జీవో విడుదల చేయడం పట్ల మంత్రిని సెర్ప్‌ ఉద్యోగులు సన్మానించారు.

లంచాలు ఇవ్వొద్దు : మంత్రి

సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనుల చేసినప్పుడు అధికారులకు ఎవరు లం చాలు ఇవ్వొద్దని మంత్రి నాయకులకు చెప్పారు. నాయినోనిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఘాటుగా మా ట్లాడారు. డీఈ కార్యాలయంలో కొందరు అధికారులు లంచాలు తీసుకొని బి ల్లులు చేస్తున్నారు అని మంత్రికి తెలిపారు. దీనిపై సంబంధిత అధికారితో మంత్రి మట్లాడారు. పనులు చేసిన వారు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని, ఎవరైనా అడిగితే తన దృష్టికి తీసు కురావాలని చెప్పారు.

సెర్ప్‌ ఉద్యోగులు పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : సెర్ప్‌ ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి ప్రజలకు అండగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సెర్ప్‌ ఉద్యో గులకు పేస్కేల్‌ జీవో వర్తింపచేసి నందుకు గాను ఉమ్మడి జిల్లాసెర్ఫ్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ధన్యవా దాలు తెలియచేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కలెక్టరేట్‌ ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమకు పేస్కేల్‌ వచ్చేలా సాయం చేసి అండగా నిలిచినందుకు మంత్రిని ఉద్యోగులు గజమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞత చాటుకున్నారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో పలువురు సెర్ప్‌ ఉద్యోగు లను సస్పెండ్‌ చేసినప్పుడు ఉద్యోగ సంఘాల నేతగా వారికోసం పోరాటం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ 3974 మంది సెర్ప్‌ ఉద్యోగులకు పేస్కేల్‌ వర్తింపచేశారని పేర్కొన్నారు. పనియే దైవంగా భావించి ఉద్యోగులు ప్ర భుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెహమాన్‌, వైస్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యు డు అన్వర్‌, మాజీ కౌన్సిలర్‌ రామకృష్ణ, ఐకేపీ రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్‌, మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్‌ సురేఖ, ఐకేపీ డీపీఎం నాగమల్లిక, సెర్ప్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

సమాజాన్ని సంస్కరింపజేసేది కవిత్వం : మంత్రి

మహబూబ్‌నగర్‌ పద్మావతి కాలనీ, మార్చి 19 : సమాజాన్ని సంస్క రింప జేసేదే కవిత్వమని అలాంటి కవిత్వమే సమాజంలో నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివా రం శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని పాలమూరు సాహితి, లుంబిని పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ పట్టణంలో గల లుంబిని పాఠశాలలో నిర్వహించిన ఉగాది కవిసమ్మేళ నం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు. ఈ కవి సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని ప్రసంగించారు. పాలమూరు జిల్లా సాహిత్యపరంగా ముందు వరుసలో ఉందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసి న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలు మృగ్యమైపోతున్నాయని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కవులపై ఉందని అన్నారు. ఉగాది పండగను పురస్కరించుకుని ప్రతీయేటా కవి సమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమ న్నారు. ప్రధానవక్తగా విచ్చేసిన ప్రముఖ పరిశోధకులు డాక్టర్‌. పి. భాస్క రయోగి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గత పదహారు సంవత్సరాలుగా ఉగాది కవిసమ్మేళనం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సభకు లుంబిని హైస్కూలు డైరెక్టర్‌ కె. లక్ష్మణ్‌గౌడ్‌ అధ్యక్షత వహించారు. కవి సమ్మీళనాన్ని డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కవులను సత్కారించారు.

Updated Date - 2023-03-19T23:15:35+05:30 IST