ప్రజారోగ్యానికి పాతర

ABN , First Publish Date - 2023-01-25T23:35:34+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజారోగ్యానికి పాతర
అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న స్కానింగ్‌ సెంటర్‌

- అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ

- రెఫరల్‌ కేసులకే పరిమితమైన కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి

- నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు

నాగర్‌కర్నూల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, సకాలంలో వైద్యం అందక రోగులకు ఎదురవుతున్న ఇక్కట్ల గురించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. మంగళవారం జిల్లా ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో పసికందు మృతదేహం బాత్‌రూమ్‌లోని డ్రైనేజీలో లభిం చిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి బుధవారం జిల్లా ఆసుపత్రి తో పాటు కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విజిట్‌ నిర్వహించింది. అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో స్కానింగ్‌ సెంటర్‌ నిరుప యోగంగా ఉంది. ఇక్కడ ఏడాది గడిచినా ఆక్సిజ న్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. డా క్టర్లు లేక స్కానింగ్‌ కేంద్రం నిరుపయోగంగా ఉండటంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు కాసుల వర్షం కురుస్తోంది. స్కావెంజర్ల జీతాల్లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సుపత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సిందిగా ముగ్గురు మాత్రమే డిప్యూటేషన్‌పై విధులు నిర్వ హిస్తుండటంతో వైద్య సేవలు సక్రమంగా అంద డం లేదు. కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నాయని అధికారులు చెబుతుండగా వాస్తవానికి 15పకడలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి డాక్టర్లు కేవలం ప్రాథమిక చికిత్స చేస్తూ అందరినీ రెఫర్‌ పేరిట నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ ఆసుపత్రులకు తర లిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ ఆసుపత్రిలో..

కందనూలు: నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రికి మెడికల్‌ కళాశాల ఏర్పాటు కావడంతో అన్ని రకాల వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రిని బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ నిర్వహిచింది. ఆసుపత్రిలో 335బెడ్లు అందుబాటులో ఉండగా అలా్ట్రసౌం డ్‌, డయాలసీస్‌, ఎక్స్‌ రే కేంద్రాలతో పాటు ప్రతీ రోజు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితోనే శానిటేషన్‌ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఇటీవల సిటీ స్కాన్‌ మిషన్‌ కూడా వచ్చింది. త్వరలో వినియోగంలోకి రానుంద ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రఘు తెలిపారు. ఇటీవల వైద్యం అందక మృతి చెందిన సంఘటనలు ఏమి లేవన్నారు.

మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మరిన్ని వైద్య సేవలు కల్పించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొప్పుల రమేష్‌ కోరారు. జిల్లా కేంద్రంలో జనరల్‌ ఆసుపత్రి ఏ ర్పడినప్పటికీ అన్ని రకాల వైద్య సదుపాయాలు చేపట్టడం లేదు. చీకటి పడితే చాలు మెరుగైన వైద్యంకోసం మహబూబ్‌ నగర్‌, హైదరాబాద్‌ రెఫర్‌ చేస్తున్నారు.

- కొప్పుల రమేష్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, నాగర్‌కర్నూల్‌

అచ్చంపేటలో అన్నీ సమస్యలే..

అచ్చంపేటటౌన్‌: అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో ప్రధానంగా గర్భిణుల సమస్యలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా, పలు సమస్యలు తారసపడ్డాయి. గర్భిణులకు సరియైున స దుపాయాలు లేవని పలువురు ఆరోపించారు. ప్రధానంగా గ ర్భిణులకు స్కానింగ్‌ కోసం ప్రైవేటు ఆసుపత్రులకు పరుగు లు తీయాల్సి వస్తున్నది. అదేవిధంగా సంవత్సర కాలం నుంచి ఆసుపత్రికి వచ్చిన ఆక్సిజన్‌ ప్లాంటు వినియోగానికి నోచుకోవడం లేదని, అది కనీసం ప్రారంభం కూడా చేయ డం లేదని రోగులు తెలిపారు. స్కావెంజర్ల జీతాలలో అవక తవకలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తు తం డిప్యూటేషన్‌పై ముగ్గురు డాక్టర్లు చాలీచాలని వైద్యం అందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆసుపత్రి పరిస్థితి ఎప్పుడు మెరుగు పడుతుందోనని రోగులు అంటున్నారు.

కొల్లాపూర్‌ ఆసుపత్రిలో..

కొల్లాపూర్‌ రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొ ట్టిచ్చినట్లు సమస్యలు తారసపడ్డాయి. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా, పలు రకాల సమస్యలతో రోగు లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిచాయి. 30 పడకలకు గాను 15 పడకలు మాత్రమే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉన్నా రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలను పెంచాలవ ల్సిన అవసరం ఉన్నది. డాక్టర్లు ఉన్నా మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేయడం పరిపాటిగా మారింది.

కల్వకుర్తి ఆసుపత్రిలో..

కల్వకుర్తి : పట్టణంలోని 50పకడల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేసింది. ఆసుపత్రిలో ఓపీలో చిన్నారులకు డాక్టర్‌ శివరాం, గర్భిణులకు డాక్టర్‌ యశోదబా యి, ఇతర పేషెంట్లకు పలువురు వైద్యులు పరీక్షించి మందు లు రాశారు. వైద్యులు రాసిన మందులను ఫార్మాలో వారు తీ సుకోవడం కన్పించింది. రక్త పరీక్షల కోసం మహిళలు, గర్భి ణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆసుపత్రిలో సిజేరి యన్‌, నార్మల్‌ డెలివరీ అయిన వారికి ఇన్‌పేషెంట్లుగా వై ద్యం పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్‌ కేంద్రం మంజూరైనప్పటికీ సెంటర్‌ ఏర్పాటుకు సరిపోయే గది లేకపో వడం వల్ల సేవలు ఇంకా ప్రారంభం కాలేదని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శివరాం తెలిపారు.

Updated Date - 2023-01-25T23:35:35+05:30 IST