రోడ్డు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2023-03-18T23:06:41+05:30 IST

ప్రతీ ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావే శ మందిరంలో ఎస్పీ రక్షిత కే మూర్తితో కలిసి రోడ్డు భద్రతపై (డీఆర్‌ఎస్‌సీ) డిస్ర్టిక్ట్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు.

రోడ్డు నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

వనపర్తి అర్బన్‌, మార్చి18: ప్రతీ ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావే శ మందిరంలో ఎస్పీ రక్షిత కే మూర్తితో కలిసి రోడ్డు భద్రతపై (డీఆర్‌ఎస్‌సీ) డిస్ర్టిక్ట్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైకులు ఓవర్‌ స్పీడ్‌గా నడిపిస్తుం టారని, ట్రాఫిక్‌ పోలీసులు గమనించి ర్యాష్‌ డ్రైవింగ్‌ నిరోధించాలన్నారు. బస్సు, లారీ డ్రైవర్లకు హెల్త్‌ క్యాంపులు నిర్వహించి వారి కంటిపరీక్షలు చేయించా లన్నారు. పరిమితికి మించి వాహనాలలో ప్రయాణి కులను ఎక్కించుకుని నడుపుతున్నారని వాటిని నిరో ధించాలని సూచించారు. అప్రోచ్‌ రోడ్‌ దగ్గర స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ట్రాఫిక్‌ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రాంతాలైన పెబ్బేరు, కొత్తకోట, పెద్దమందడి ప్రాంతాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నా యని తెలిపారు. వెల్టూరు ఎక్స్‌ రోడ్డు దగ్గర ప్రమా దాలు జరగకుండా ఇంజనీర్లు తగు చర్యలు తీసుకో వాలన్నారు. వెల్టూరు, కనిమెట్ట ఎక్స్‌రోడ్డు, పాలెం దాబా, మథర్‌ థెరిస్సా జంక్షన్‌, అమడబాకుల, ఆర్కే దాబా, ఫ్లై ఓవర్‌, తోమాలపల్లి, ఆనంద భవన్‌ ఎక్స్‌ రోడ్డు, బైపాస్‌, రంగాపూర్‌ ఎక్స్‌ రోడ్డు దగ్గర ప్రమా దాలు జరగకుండా చూడాలన్నారు. జాతీయ రహ దారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలలో జాతీయ రహ దారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కమిషనర్లను కోరారు. అనంతరం డిస్ర్టిక్ట్‌ లెవెల్‌ కమిటీ మీటింగ్‌ ఆర్‌టీసీ సమీక్షలో ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ మాట్లాడుతూ నో పార్కింగ్‌, నోఎంట్రీ జోన్‌ లలో ప్రైవేటు జీపులు, ఆటోలు నిలుపుతున్నారని పోలీస్‌ వాళ్లు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అదే విధంగా ప్రైవేటు వాహనాలు సామార్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని హైవేపై స్పీడ్‌ గా నడుపుతున్నారని తెలిపారు. ప్రైవేట్‌ వాహన యజమానులకు అవగాహన కల్పంచి ఓవర్‌ స్పీడ్‌ ను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశ్యనాయక్‌, ఆర్టీసీ డీఎం పరమేశ్వరి, జిల్లా రవాణా శాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డి, జాతీయ రహదారుల ఇంజనీర్‌ సుధాకర్‌, మునిసిపల్‌ కమిష నర్లు అనిల్‌, జాన్‌ కృపాకర్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌, ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:06:41+05:30 IST