కారులో కుంపటి

ABN , First Publish Date - 2023-08-02T00:10:25+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అసమ్మతి వర్గం స్వరాన్ని పెంచింది. ఆ పార్టీ నుంచి అసంతృప్తులు క్రమంగా కాంగ్రెస్‌ పార్టీకి చేరవవుతున్న క్రమంలో తాజాగా చోటు చేసుకుం టున్న రాజకీయ పరిణామాలు బీఆర్‌ఎస్‌ శ్రేణులకు విస్తుగోల్పుతున్నాయి.

కారులో కుంపటి

- కల్వకుర్తి నియోజకవర్గంలో జైపాల్‌యాదవ్‌కు సెగ

- ఏకమవుతున్న కసిరెడ్డి వర్గీయులు

- నేడు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న మాజీ మంత్రి జూపల్లి

-అచ్చంపేటలో అనుచర గణాన్ని పెంచుకుంటున్న ఎంపీ రాములు

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అసమ్మతి వర్గం స్వరాన్ని పెంచింది. ఆ పార్టీ నుంచి అసంతృప్తులు క్రమంగా కాంగ్రెస్‌ పార్టీకి చేరవవుతున్న క్రమంలో తాజాగా చోటు చేసుకుం టున్న రాజకీయ పరిణామాలు బీఆర్‌ఎస్‌ శ్రేణులకు విస్తుగోల్పుతున్నాయి. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా విమర్శలకు దిగారు. ఆయనకు టికేట్‌ ఇస్తే ఓడించి తీరుతామని బీఆర్‌ఎస్‌లోని కొందరు శపథం చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి లేదా మరో మారు బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడికి కల్వకుర్తి టికేట్‌ కేటాయించాలంటూ అధిష్టానానికి లేఖ కూడా రాశారు. మఽధ్యేమార్గంగా ఇద్దరు నాయకులు పదవులు అనుభవిస్తున్నారని మూడో వ్యక్తికి టికెట్‌ కేటాయించాలంటూ కూడా బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి సంకేతాలిచ్చారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌లో నెలకొన్న కుంపటి మరే ఏ నియోజకవర్గంలో కూడా ఈ స్థాయిలో లేదు. ఈ రోజు ఎక్కడ ఉంటారో మరో రోజు ఎక్కడా ఎవరి పక్షాన మాట్లాడుతారో తెలియక జనంతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా తేల్చుకోలేకపోతు న్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన అచ్చంపేటలో కూడా పరిస్థితి అలాగే ఉన్నది. ఎంపీ పోతుగంటి రాములు తనయుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌కు జడ్పీ చైర్మన్‌ పదవి దక్కకుండా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు కుయుక్తులు చేశారంటూ రాములు వర్గం రగిలిపోతుంది. ఎక్కడా పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుం టామంటూ గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా ఎంపీ తనయుడు భరత్‌ప్రసాద్‌ కొద్ది రోజుల పాటు అచ్చంపేట నియోజకవర్గంలో హల్‌చల్‌ చేశారు. ఈ వాదన కూడా పార్టీ అధినేత దాకా వెళ్లింది. పోతుగంటి రాములు అచ్చంపేట ఎమ్మెల్యే మధ్య వివాదం పార్టీకి నష్టం కలిగిస్తున్న విషయం పట్ల తేలుసుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత ఇరువురి మధ్య తాత్కాలికంగా సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ తనయుడు భరత్‌ అచ్చం పేట రాజకీయాల్లో తలదూర్చకుండా మిన్నకుండి నట్లు రాజకీయ విశ్లేషణ జరుగుతుంది. కొల్లా పూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణా రావుల మధ్య కొనసాగిన ప్రచ్చన్న యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. బుధవారం ఢిల్లీలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ కండువా కప్పు కోనున్న నేపథ్యంలో కొల్లాపూర్‌ రాజకీయా లు ఆసక్తికరంగా మారనున్నాయి. టికెట్‌ హామీతో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ కండువా కప్పుకో నున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న సీఆర్‌ జగదీశ్వర్‌రావు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతు న్నారనే అంశంపై విశ్లేషణాత్మక చర్చ జరుగు తోంది. ఇదే పరిస్థితి నాగర్‌కర్నూల్‌లో కూడా నెలకొంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి కూడా బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ క్యాడర్లు ఎవరీ పక్కన నిలబడుతాయనే విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మర్రి జనార్దన్‌రెడ్డి వెంట క్యాడర్‌ వెన్నుదన్నుగా ఉండే విధంగా క్షేత్రస్థాయిలో మర్రి వర్గం ప్రయత్నిస్తుండడం గమనార్హం. కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడం ఈ విషయంలో నాగం జనార్దన్‌రెడ్డి తనకే టికెట్‌ ఇవ్వాలంటూ బహిరంగంగా ప్రకటించిన క్రమంలో వారిద్దరి మధ్య అనైక్యత తాము అనుకున్న దానికంటే వందశాతం అనుకూల అంశంగా మారుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆశాభావంతో ఉన్నారు.

Updated Date - 2023-08-02T00:10:25+05:30 IST