రైతు రుణమాఫీని అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-07-20T23:16:38+05:30 IST

గత ఎన్నికల సమయంలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతు రుణమాఫీని అమలు చేయాలి
పెద్దమందడి తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు

- కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి

- తహసీల్‌ ముందు ధర్నా

పెద్దమందడి, జూలై 20 : గత ఎన్నికల సమయంలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి రైతులు రుణమాఫీ వెంటనే చేయాలంటూ పెద్దమందడి తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు గాను అధికారులు వడ్డీలపై వడ్డీలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ వర్షాకాలం సీజన్‌ కోసం ప్రభుత్వం పంట సహాయాన్ని విడుదల చేసినా వారి ఖాతాలను నిలిపివేయడంతో అన్న దాతలు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారని వా పోయారు. 24 గంటల కరెంటును ఎలా ఇస్తు న్నారో సబ్‌స్టేషన్‌కు వస్తే చూపిస్తామని అన్నారు. రైతులను రెచ్చగొట్టి రైతువేదికల వద్ద రాజకీయా లు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పెంటన్నయాదవ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి గట్టుమన్యం, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ మం డల అధ్యక్షుడు దయాకర్‌, మాజీ సర్పంచు కురు మయ్య, వాకిటి శ్రీనివాసులు తదితరులున్నారు.

Updated Date - 2023-07-20T23:16:38+05:30 IST