Share News

ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

ABN , First Publish Date - 2023-12-02T22:58:09+05:30 IST

ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజి నేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం..

ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి
రాములు(ఫైల్‌)

నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెంలో ఘటన

బిజినేపల్లి, డిసెంబరు 2 : ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజి నేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు(60) విత్తనపు వడ్లను కొనుగోలు చేసేందుకు శనివారం పాలెం గ్రామానికి వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాములును బ స్టాండ్‌ సమీపంలో కొల్లాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాములు భార్య శ్యామలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

Updated Date - 2023-12-02T22:58:10+05:30 IST