కళాశాలలో సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2023-03-08T23:31:29+05:30 IST

పట్టణంలోని జూని యర్‌ కళాశాలలో కావా ల్సిన సదుపా యాలను వెంటనే ఏర్పాటు చేయా లని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదే శించారు.

కళాశాలలో సదుపాయాలు కల్పించాలి
కళాశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

నారాయణపేట వి ద్యావిభాగం, మార్చి 8: పట్టణంలోని జూని యర్‌ కళాశాలలో కావా ల్సిన సదుపా యాలను వెంటనే ఏర్పాటు చేయా లని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదే శించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈనెల 6న ప్రచురితమైన ‘సమస్య ల వలయంలో సరస్వతీ నిలయం’ కథనానికి కలె క్టర్‌ స్పందించారు. కళాశాలను పరిశీలించి విద్యార్థుల సంఖ్యను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకు న్నారు. కళాశాల ఆవరణను పరిశీలించి మౌలిక వసతులపై ఆరా తీశారు. సమస్యల పరిష్కా రానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, కౌన్సిల్‌ హాల్‌ను పరిశీలించారు. జిల్లా గ్రంథాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేసి అక్కడున్న పుస్తకాలను పరిశీలించారు.

Updated Date - 2023-03-08T23:31:29+05:30 IST