సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2023-09-21T23:33:11+05:30 IST
వనపర్తి మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ నెల చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

- వనపర్తి మెడికల్ కాలేజీలో పూర్తయిన ప్రవేశాలు
- 85 శాతం స్థానికులకు, 15శాతం ఆలిండియా కోటాలో భర్తీ
-150 సీట్లకుగాను 149 సీట్లలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు
వనపర్తి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వనపర్తి మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ నెల చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కళాశాలలో మొత్తం 150 సీట్లు ఉండగా.. గతేడాది నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మొదటి బ్యాచ్ విద్యార్థులు మొదటి సంవత్సరం చివరి పరీక్షల కోసం సన్నద్ధమవుతుండగా.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నవంబరు 14 నుంచి పరీక్షలు నిర్వహించేం దుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక రెండో బ్యాచ్ కు సంబంధించి నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ పూర్త య్యింది. మొత్తం 150 సీట్లకు గాను 149 సీట్లలో విద్యార్థు లు అడ్మిషన్ పొందారు. మిగిలిన ఒక్క సీటు కూడా భర్తీ అయినప్పటికీ ధ్రువపత్రాల్లో తేడాలు ఉండటంతో దాన్ని రద్దు చేశారు. ఆ సీటును యూనివర్సిటీ సూచనల మేరకు ప్రత్యేక కోటాలో భర్తీ చేసే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది హాస్టల్ ఫీజును దాదాపు రూ. 5వేలు తగ్గించారు. అలాగే ట్యూషన్ ఫీజులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.27వేలు, బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.29వేల చొప్పున గతేడాది మాదిరిగానే ఫీజులను నిర్ణ యించారు. పూర్తి స్టూడెంట్ మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు భర్తీ చేస్తుండగా.. అందులో స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం తిరిగి మెజారిటీ ఫీజును విద్యార్థులకు చెల్లిస్తోంది. ఇవికాకుండా మెస్ చార్జీలు రూ. 4,500 చొప్పున విద్యార్థులే చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఏపీ విద్యార్థుల కోటా రద్దు..
కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కళాశాలల్లో 85శాతం స్థానిక విద్యార్థులకే అడ్మిషన్లు కల్పించే విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది మొద టి సంవత్సరం ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులకు 15శాతం ప్రత్యేక కోటాను కల్పించగా.. సుమారు 18 మంది ఏపీకి చెందిన విద్యార్థులు వనపర్తి మెడికల్ కళాశాలలో అడ్మిష న్లు పొందారు. అయితే ఈ ఏడాది ఆ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది ప్రవేశాల్లో 85శాతం స్థానిక కోటా కింద 127 మంది తెలంగాణ విద్యార్థులకే అవకాశం కల్పించింది. అలాగే ఆలిండియా కోటా 15 శాతం కింద మొత్తం 22 మంది విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రవేశం కల్పించింది. మొదటి బ్యాచ్ పాసింగ్ ఔట్ అయ్యే సమ యానికి వనపర్తి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల తో ఆసుపత్రి నిర్మాణం పూర్తికానుంది.
ఏర్పాట్లు పూర్తి..
గతేడాది ప్రారంభమైన మెడికల్ కళాశాలను నర్సింగ్ కళాశాల కోసం నిర్మించిన భవనంలో తరగతులను ప్రారంభించారు. అలాగే మెడికల్ కళాశాల కోసం శాశ్వత భవనాల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో హాస్టల్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమెన్స్ హాస్టల్ కోసం అధికారులు టీచర్స్ కాలనీలో ఓ నూతన భవనాన్ని గుర్తించి.. ప్రతిపాదనలు పంపించారు. మెన్స్ హాస్టల్‌కు సంబంధించి గతేడాది నిర్వహించిన రాజపేట శివారులోని యూత్‌ట్రెయినింగ్ సెంటర్‌లోనే కొనసాగించ నున్నారు. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి 56 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేయగా.. 35 పోస్టులను భర్తీ చేశారు.. ఒక్కరు రిజైన్ చేశారు. మిగతా పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ.. భర్తీ చేస్తున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించి ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆ శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.