అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి

ABN , First Publish Date - 2023-06-26T23:09:23+05:30 IST

అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, హాజరైన అధికారులు

- 13 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, జూన్‌ 26 : అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని సమీ కృత కార్యాలయాల సముదాయంలోని సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఓట ర్‌ జాబితా, ఇంటింటి సర్వే తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరి పేరును ఫారం-6 ద్వారా జాబితాలో నమోదు చేయాలన్నారు. ఎవరైనా ఓటరు మరణిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారి పేరును జాబితా నుంచి తొలగించాలన్నారు. ఇంటింటి సర్వే పూర్తి చేసి జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను పరిశీలించాలని, పోలింగ్‌ స్టేషన్ల వారీగా రెండు శాతం ఎక్కువ పేర్లు తొలగించి ఉంటే, ఆ జాబితాను ఆర్‌ఐలు ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించారు. జూలై 13 నాటికి ఇంటిం టి సర్వే పూర్తి చేసి జాబితాలు ఇవ్వాలని సూచించారు. బీఎల్‌వో పరిధిలో ఉన్న ఓటర్లందరికి నో డూప్లికేట్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని చెప్పారు. వికలాంగుల పేర్లను సదరం సర్టిఫికేట్‌ ఆధారంగా ఓటర జాబితాలో నమోదు చేయాలన్నారు. వచ్చేనెల ఒకటవ తేదీన గ్రూప్‌-4 పరీక్షలున్నాయని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలను తహసీల్దార్లు ముందుగానే పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా పోలీస్‌శాఖతో సమన్వ యం చేసుకొని, పరీక్షలు సజావుగా కొనసాగేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, ఆర్డీవో రాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ సమావేశపు హాలులో సోమ వారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి 230 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా భూసమ స్యలకు సంబంధించినవి 183 ఉన్నాయి. ఆసరా పింఛన్ల కు సంబంధించి 12, ఇతర సమస్యలపై 35 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల అధికారుల తో చర్చించి, వారి పరిధిలోని దరఖాస్తులను పరిష్కరిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మీ సేవలో సక్సేషన్‌ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సకాలంలో సీఎంఆర్‌ అప్పగించాలి

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం భారత ఆహార సంస్ధకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైజ్‌ అప్పగించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి రైస్‌మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖరీఫ్‌కి సంబంధించి 18,844 మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావలసి ఉందని, వెంటనే అప్పగించ కపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, డీఎం ప్రసాద్‌రావు, అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-06-26T23:09:23+05:30 IST