సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2023-09-21T23:44:26+05:30 IST

అన్ని వర్గాలకు సమ న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటరీ అబ్జర్వర్‌ పీవీ మోహన్‌ అన్నారు.

సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
ధరూరులో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న అబ్జర్వర్‌ మోహన్‌

- నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అబ్జర్వర్‌ మోహన్‌

ధరూరు/ రాజోలి/ వడ్డేపల్లి, సెప్టెంబరు 21 : అన్ని వర్గాలకు సమ న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటరీ అబ్జర్వర్‌ పీవీ మోహన్‌ అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూ రు, కేటీదొడ్డి మండలాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, బల్గెర నారాయ ణలతో కలిసి ప్రారంభించారు. ఈ సందరర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకా రం అధికారంలోని వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌ గౌడ్‌, విశ్వనాథ రెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, పాతపాలెం శ్రీనివాస్‌ గౌడ్‌, మజీద్‌, గోనుపాడు శ్రీనివాస్‌ గౌడ్‌, అల్వాల రాజశేఖర్‌ రెడ్డి, నందిన్నె ఆంజనేయులు, ఆనంద్‌ గౌడ్‌, గోవింద్‌రెడ్డి, జహంగీర్‌, శేషాద్రి, సురేష్‌, గౌస్‌, మాబాషా, దినేష్‌, రాము, ఆనంద్‌, తాన్యనాయక్‌, ఎల్కూర్‌ తిమ్మన్న, శేఖరయ్య, పాషా, జమాల్‌, కొండపల్లి రాఘవేంద్రరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, గోవింద్‌ పాల్గొన్నారు.

అలంపూర్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా

అలంపూర్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ అన్నారు. రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో గురువారం ఆయన కాంగ్రెస్‌ జెండాను ఆవిష్క రించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాజోలి మండల అధ్యక్షుడు దస్తగిరి, వడ్డేపల్లి మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, రక్మానందరెడ్డి, జయన్న, నాయకులు దేవేందర్‌, బాబురావు, తిమ్మప్ప, కుమార్‌ పాల్గొన్నారు.

వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ అనుకూలం

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ అనుకూలమేనని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ స్పష్టం చేశారు. శాంతినగర్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నాయకుల ఆధ్వర్యంలో బుధ వారం ధర్నా చేశారు. వారి ఆందోళనకు ఆయన మద్దతు తెలిపి, మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని తమ పార్టీ ఎంపీలతో ఒత్తిడి చేయిస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు కొంకల భీమన్న, ఎమ్మెస్పీ జిల్లా కన్వీనర్‌ అయిజ రాజు మాట్లాడుతూ ఎస్పీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచు గార్లపాడు భూషణం, మండల అధ్యక్షుడు ఏసేపు, సీనియర్‌ నాయకులు గట్టన్న, రామాపురం రామన్న, రామకృష్ణ, దస్తగిరి, చిన్నిబాబు, పురుషోత్తం, శేఖర్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-09-21T23:44:39+05:30 IST