ముగిసిన ఎద్దుల గిరక పోటీలు

ABN , First Publish Date - 2023-03-30T23:23:57+05:30 IST

శ్రీరామనవమి సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని మూలమల్ల గ్రామంలో నిర్వహించిన ఎద్దుల బండ్ల గిరక పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ముగిసిన ఎద్దుల గిరక పోటీలు
గిరక లాగుతున్న ఎద్దులు

ఆత్మకూర్‌, మార్చి30: శ్రీరామనవమి సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని మూలమల్ల గ్రామంలో నిర్వహించిన ఎద్దుల బండ్ల గిరక పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం ఆత్మకూర్‌ సీఐ రత్నం, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌ ప్రశాంతి రాజు, ఉమ్మడి ఎంపీ టీసీ సభ్యులు శ్యామల వెంకట్‌ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పాల మూరు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల నుంచి 32 జతలు పోటీలో పాల్గొ న్నాయి. రాత్రి 9 గంటల వరకు జరిగిన పోటీలలో అనుగొండ రాములు గౌడ్‌ ఎద్దులు మొదటి బహుమతి సాధించగా, వడ్డెవాట గుడిసె రంగన్న ఎద్దులు రెండో బహుమతి, కుచ్చినెర్ల రాములు ఎద్దులు మూడవ బహుమతి, నందిత ఎ ద్దులు నాలుగో బహుమతి సాధించాయి. బహుమతులు సాధించిన రైతులకు మొదటి బహుమతి వేణుగోపాల్‌ రెడ్డి, రెండవ బహుమతి గ్రామ సర్పంచ్‌ ప్రశాంతి రాజు మూడో బహుమతి బీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ మండల అధ్యక్షులు ఆనంద్‌ గౌడ్‌ , నాలుగో బహుమతి రంగారెడ్డి గ్రామ ఉపసర్పంచ్‌ లు బహుమ తులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:23:57+05:30 IST