ఉత్తీర్ణతా శాతం పెంపునకు కృషి

ABN , First Publish Date - 2023-02-23T23:54:20+05:30 IST

పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎండీ సిరా జుద్దీన్‌ తెలిపారు.

ఉత్తీర్ణతా శాతం పెంపునకు కృషి
ఉపాధ్యాయులతో సమావేశమైన రాష్ట్ర బృందం సభ్యులు

- డీఈవో ఎండీ సిరాజుద్దీన్‌

- రాష్ట్ర బృందంతో సమావేశం

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 23 : పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎండీ సిరా జుద్దీన్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షల కార్యాచరణ ప్రణాళిక, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధి కారుల బృందంతో గురువారం ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు ఇప్పటి వరకు పూర్తి అయిన సిలబస్‌, నిర్వహించిన స్లిప్‌ టెస్టులు, విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలించారు. దీంతో పాటు పలు పాఠశాలలను సందర్శించిన బృందం సభ్యులు చంద్రశేఖర్‌, సతీష్‌కుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి, వంశీ కృష్ణలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమా వేశమై వివరాలను సేకరించారు. తొలి రోజు పర్యట నలో పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠ శాల, బురదపేట హైస్కూల్‌, నల్లకుంట, బురద పేట ప్రాథమిక పాఠశాలతో పాటు, గద్వాల కేజీబీవీ, ఎర్రవల్లి, కొండేరు పీఎస్‌లు, ఇటిక్యాల, కొండేరు జడ్పీహెచ్‌ఎస్‌లను పరిశీలించారు. అనం తరం డీఈవో, జిల్లా సమన్వయ అధికారి ఎస్తేరు రాణి, బీసీఏబీ కార్యదర్శి ప్రతాప్‌ రెడ్డి, పరీక్ష విభాగం అధికారి శ్రీనివాస్‌, ఎంఈవో రాజులతో సమావేశమయ్యారు.

Updated Date - 2023-02-23T23:54:22+05:30 IST