గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2023-03-25T23:44:41+05:30 IST

గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలని, గ్రామ స్వరాజ్య పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం, కలెక్టర్‌

- గ్రామ పంచాయతీలకు జిల్లా, జాతీయ స్థాయి అవార్డుల ప్రదానం

- వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌, మార్చి 25 : గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలని, గ్రామ స్వరాజ్య పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్ట రేట్‌లోని మీటింగ్‌ హాల్లో దీనదయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత వికాస్‌ పూరస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. మొదట జ్యోతి ప్రజ్వ లన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంత రం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అవార్డులలో మొదటి స్థానం దక్కించుకున్న దని తెలిపారు. వనపర్తి జిల్లా అన్ని రంగాలలో అభి వృద్ధి సాధించడానికి అధికారులు కృషి చేయాల న్నారు. తొమ్మిదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగా లలో అభివృద్ధి సాధిస్తుందని మంత్రి తెలిపారు. చాలా రాష్ర్టాలలో కనీసం టాయి లెట్స్‌ కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. కోవిడ్‌ సమయంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీ సిబ్బంది, వైద్య, ఆరోగ్య శాఖ ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. సర్పం చులు, కార్యదర్శులు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు. కేంద్ర అవార్డులలో తెలం గాణకు 19 అవార్డులు దక్కడం సంతోషించదగ్గ విష యం అన్నారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు అవార్డులు పొందవచ్చని మంత్రి తెలిపారు. అనంతరం అవార్డులు పొందిన 27 మంది సర్పంచులను అభినందించారు. కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ మాట్లాడుతూ గతేడాది చేసిన కృషికి ఫలితంగా 27 గ్రామ పంచాయతీలకు జాతీ య స్థాయిలో అవార్డులు రావడం అభినందనీయ మన్నారు. అనంతరం పేదరిక నిర్మూలన, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, సూపర్‌ పాలన, నీటి సమృద్ధి, స్వయం సమృ ద్ధి, సామాజిక భద్రతా వంటి 9 అంశాల్లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సర్పంచులు, గ్రామ కార్య దర్శులకు అందించి, సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, జడ్పీ చైర్మన్‌ లోక్‌ నాథ్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఆర్డీవో పద్మావతి, జడ్పీ సీఈవో శ్రవణ్‌కుమార్‌, డీపీవో సురే ష్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, సర్పంచులు, పంచా యతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించిన మంత్రి

వనపర్తి టౌన్‌ : ప్రయాణికుల సౌకర్యం కోసమే ఆర్టీసీ సంస్థ నూతన బస్సులను ఏర్పాటు చేసిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో రెండు నూతన బస్సులను ఆయన కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, డిపో మేనేజర్‌ పరమేశ్వరితో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి నుంచి హైదరాబాద్‌ కోసం నూతన బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయని అన్నారు. అనంతరం ఆర్టీసీ నూతన బస్సులో తొలి టికెట్‌ తీసుకుని మాతా శిశు ఆరోగ్య కేంద్రం వరకు, అక్కడి నుంచి తిరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు బస్సులో మొదటి ప్రయాణం చేశారు.

అంబలి కేంద్రాల ఏర్పాటు..

మంత్రి నిరంజన్‌రెడ్డి తన తల్లి సింగిరెడ్డి తారకమ్మ పేరు మీద సింగిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో, మాతా శిశు సంరక్షణ కేంద్ర ఆవరణలో అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి వివిధ అవసరాల కోసం వచ్చే వారితో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మంత్రికి పూలబొకేతో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజ్‌కుమార్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ బంగారయ్యలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ రమేష్‌ గౌడ్‌, వాకిటి శ్రీధర్‌, ఆర్టీసీ ఉద్యోగులు డీఆర్‌ గౌడ్‌, చిన్ని రమేష్‌, మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:44:41+05:30 IST