విధులు సక్రమంగా నిర్వర్తించాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:31 PM
అంగన్‌వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులకు హజరు కావా లని సీడీపీవో కమలాదేవి ఆదేశించారు.
- సీడీపీవో కమలాదేవి
- పలు అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ
మల్దకల్, డిసెంబరు 18 : అంగన్‌వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులకు హజరు కావా లని సీడీపీవో కమలాదేవి ఆదేశించారు. మండ లంలోని మేకలసోంపల్లి 1,2, పాల్వాయి, మల్ద కల్-1 అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. పిల్లల హాజరు, మెనూ అమలు, స్టాక్, ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణపై అంగన్‌వాడీ టీచర్లతో చర్చించారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రంలోనే వండిన ఆహారాన్ని భుజించాలని, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు మాత్రమే బాలామృతం, 16 గుడ్లు ఇస్తారని తెలిపారు. ప్రతీ రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయం త్రం నాలుగు గంటల వరకు కేంద్రాలను నిర్వ హించాలని ఆదేశించారు. కేంద్రంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పోషణ లోపంతో బాధపడే చిన్నాలను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట పోషణ్ అభియాన్ జిల్లా అధికారి రఘునాథరెడ్డి ఉన్నారు.