నాలుగు నెలల తరువాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-09-21T23:06:22+05:30 IST
డీఎస్సీ పరీక్షలను నాలుగు నెలల తరువాతే నిర్వ హించాలని గురువారం డీఈడీ, బీఈడీ అభ్యర్థులు అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతి పత్రం అందించారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 21 : డీఎస్సీ పరీక్షలను నాలుగు నెలల తరువాతే నిర్వ హించాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థులు అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతి పత్రం అందించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ భవనం ముందు డిమాండ్లతో కూ డిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ అరకొర ఖాళీలతో డీఎస్సీ ప్రకటన జారీ చేసి ఆదరాబాదరాగా పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను కూడా కలుపుకుని ఉద్యోగాల సంఖ్య పెంచా లని కోరారు. అలాగే, పరీక్షల సన్నద్ధత కోసం అభ్యర్థులకు నాలుగు నెలల సమయం ఇవ్వాల న్నారు. దరఖాస్తు ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.500లకు తగ్గించాలని వారు కోరారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.