డబుల్‌ సెంచరీ

ABN , First Publish Date - 2023-06-26T22:51:14+05:30 IST

కూరగాయల ధరలు చుక్కలనంటాయి. కూరలలో రోజూ వినియోగించే పచ్చిమిర్చి కిలోకు రూ.120, టమాట రూ.90 ధరలు పలుకగా, బీర్నీస్‌ కాయ ఏకంగా రూ.220కి చేరింది. ఈ ధరలను చూసిన సామాన్యులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏమీ కొనలేక పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.

డబుల్‌ సెంచరీ
నారాయణపేటలో కూరగాయలను కొంటున్న జనం

చుక్కలనంటిన కూరగాయల ధరలు

కిలోకు బీర్నీస్‌కాయ రూ.220, పచ్చిమిర్చి రూ.160, టమాట రూ.90,

పెరిగిన ధరలతో సామాన్యుల బెంబేలు

స్థానికంగా తగ్గిన ఉత్పత్తి..

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్లే ధరల పెరుగుదల

కూరగాయల ధరలు చుక్కలనంటాయి. కూరలలో రోజూ వినియోగించే పచ్చిమిర్చి కిలోకు రూ.120, టమాట రూ.90 ధరలు పలుకగా, బీర్నీస్‌ కాయ ఏకంగా రూ.220కి చేరింది. ఈ ధరలను చూసిన సామాన్యులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏమీ కొనలేక పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. స్థానికంగా ఉత్పత్తి లేక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ర్టాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి రావడం ధరల పెరుగుదలకు కారణమైంది.

అచ్చంపేట/నారాయణపేట/పాలమూరు/గద్వాల టౌన్‌/ వనపర్తి టౌన్‌, జూన్‌ 26: పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. టమాట, పచ్చిమిర్చిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుం టున్నారు. ఈ నేపథ్యంలో ధరలు అమాంతం పెరిగి పోయాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట ధర రూ.80 ఉండగా, పచ్చిమిర్చి ధర ఏకంగా రూ.130కిపైగా ఉంది. మిగతా కూరగాయల ధరలు కూడా రూ.50కి పైగానే ఉన్నాయి. దాంతో కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు. స్కూల్స్‌ ప్రారంభం కావడం, పంటల సాగుతో జూన్‌, జూలై నెలల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమ యంలోనే కూరగాయల రేట్లు పెరగడంతో పేద ప్రజలు కూరగాయలను తినలేని పరిస్థితి ఏర్పడింది.

ధరల పెరుగుదల అందుకే..

అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గామ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి మా ర్కెట్‌ల నుంచి టమాట, పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాబేజీ, క్యాప్సికమ్‌, బీట్‌రూట్‌, చామగడ్డ తదితర కూరగాయలను అచ్చంపేట మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. ట్రాన్స్‌పోర్టు తదితర ఖర్చులతో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ధరలు వింటే భయమేస్తుంది

మార్కెట్‌లో కూరగా యల ధరలు వింటే భయ మేస్తోంది. ధరలు ఒక్క సారిగా పెరగడంతో సామా న్య ప్రజలు కొనలేని పరి స్థితి ఏర్పడింది. ప్రభు త్వం కూగాయల సాగు కోసం రైతులను ప్రోత్స హించాలి.

- రాధిక, అచ్చంపేట

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం

జిల్లాలో ఎక్కడా టమాట, పచ్చిమిర్చి ఇతర కూరగాయాలు దొరకడం లేదు. వ్యాపారం నడవాలంటే ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసి తేవాలి. అందుకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెప్పిస్తున్నాం. రెండు నెలలు వరకు ధరలు ఇట్లనే ఉంటాయి. రైతుల నుంచి కూరగాయలు వస్తే ధరలు తగ్గుతాయి.

- మల్లేష్‌, కూరగాయాల వ్యాపారి, అచ్చంపేట

దిగుబడి లేకనే అధిక ధరలు

అన్నిరకాల కూరగాయల దిగుబడులు తగ్గడం, విని యోగదారుల డిమాండ్‌కు తగినంత సరుకు మార్కె ట్‌లోకి రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. మాకు వేసవితో పోల్చు కుంటే వచ్చే లాభం కూడా తక్కువే. ధరలు పెరగడం వల్ల సరుకు అమ్ముడుపోని సందర్భాల్లో పెద్ద మొత్తంలో నష్ట పోవాల్సి వస్తోంది.

- రాములు, కూరగాయల వ్యాపారి, గద్వాల

ఏమీ కొనలేకపోతున్నాం

పెరిగిన ధరలతో ఏం కొనాలో తోచడం లేదు. నెల కిందట రూ.100తో సంచి నిండా కూరగాలు కొనేవారం. ఇప్పుడు రూ.400 పెట్టినా సంచి నిండటం లేదు. ఒకవైపు పప్పులు, నూనెలు ఇతర కిరాణం సరుకుల ధరలు భారంగా మారాయి. ఇప్పుడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు.

- మాధవి, గృహిణి, గద్వాల

Updated Date - 2023-06-26T22:51:14+05:30 IST