డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2023-02-08T23:27:27+05:30 IST
అమరచింత మునిసిపాలిటీలోని 148 సర్వే నంబర్‌లో ప్రభు త్వం ఇచ్చిన ప్లాట్లలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్‌లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మునిసిపల్ కార్యాలయం ముం దు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
- సీపీఐ ధర్నా
అమరచింత, ఫిబ్రవరి 8 : అమరచింత మునిసిపాలిటీలోని 148 సర్వే నంబర్‌లో ప్రభు త్వం ఇచ్చిన ప్లాట్లలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్‌లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మునిసిపల్ కార్యాలయం ముం దు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి అబ్రహం మాట్లాడుతూ 2008లో ఇల్లు లేని నిరుపేదలకు 133 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న 148 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో అప్పట్లో 135 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారన్నారు. అయితే, అట్టి ప్రభుత్వ భూమిలో నీటి సౌకర్యం గాని, కరెంటు సరఫరా కానీ లేదని, కనీస మౌలిక వసతులు లేక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడి బేస్‌మెంట్లు వేసుకున్నారని తెలిపారు. 15ఏళ్ల కిందట ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదా రులు ఇల్లు కట్టుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 148లో ఇచ్చిన ప్లాట్లలో లబ్ధిదారులందరికీ మూడు లక్షలు మంజూరు చేసి డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించాల ని డిమాండ్ చేశారు. అలాగే, ఆ ప్లాట్ల స్థలంలో మౌలిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. అనంతరం పురపాలక కార్యాలయ బిల్ కలెక్టర్ ప్ర భాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమం లో సీపీఐ పట్టణ కార్యదర్శి భాస్కర్, నాయకులు శ్యాంసుందర్, ఎర్రన్న, కుతుబ్ తదితరులున్నారు.