రాజకీయ టూరిస్టులకు భయపడొద్దు

ABN , First Publish Date - 2023-05-31T23:37:16+05:30 IST

ఎన్నికలు దగ్గరవడంతో రాజకీయ టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారని, కానీ వారి మాయలో పడి మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు.

రాజకీయ టూరిస్టులకు భయపడొద్దు
గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ కవచంలాంటి వారు

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- కార్పొరేట్‌ స్థాయిలో విద్యనందిస్తున్న ఘనత తెలంగాణదే

- ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల, మే 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఎన్నికలు దగ్గరవడంతో రాజకీయ టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారని, కానీ వారి మాయలో పడి మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ కవచం లాంటి వారని, ఆయనకు సరితూగే నాయకుడు ఈ ప్రతిపక్షాల్లో ఎవరు న్నారని ప్రశ్నించారు. తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని అన్నారు. యాసంగిలో 56 లక్షల ఎకరాలలో వరి సాగుచేసి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాలుగు రిజర్వాయర్‌ల నిర్మాణం చేపట్టామని, గతంలో నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతలకు రిజర్వాయర్‌లు లేవన్నారు. గత ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న తేడా అదేనని వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ ఇత ర రాష్ట్రాలలో అమలు చేసేందుకు అక్కడి ప్రభు త్వాలు సిద్ధ మవుతున్నాయని తెలిపారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్‌ స్థాయి విద్యనభ్యనందించేందుకు వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామ న్నారు. జడ్చర్ల పట్టణంలోని రెండు మెట్ల బావుల పునరుద్దురణ కోసం నిధు లు మంజూరీ చేస్తానని వెల్లడించారు. కార్పొరేట్‌ స్థాయిలో విద్యనిందస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని మహారాష్ట్రలో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంద న్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్లు స్వర్ణాసుధాకర్‌రెడ్డి, శాంతకుమారి, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ వాల్యానాయక్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య సర్పంచ్‌ మమత, బాద్మి శివకుమార్‌, వాల్యానాయక్‌, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:37:16+05:30 IST