దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-04-03T23:14:55+05:30 IST

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అధికారులు

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- అధికారికంగా జయంతి వేడుకలు

- నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు

గద్వాల క్రైం, ఏప్రిల్‌ 3 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ వల్లూరు క్రాంతితో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు. కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ వెట్టి చాకిరీ, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన దొడ్డి కొమురయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, డీపీఆర్‌వో చెన్నమ్మ, ఏవో యాదగిరి, సూపరింటెండెంట్లు వరలక్ష్మి, రాజు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ భగత్‌సింగ్‌

ఎర్రవల్లి చౌరస్తా : తెలంగాణ భగత్‌సింగ్‌గా దొడ్డి కొమురయ్యను పిలుస్తారని పదవ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ అనీల్‌కుమార్‌ అన్నారు. ఇటిక్యాల మండలం, ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ బెటాలియన్‌లో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన కొమురయ్య అశయాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, రాజేష్‌, రాజారావు, రమేష్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

పోరాట యోధుడు

గద్వాల టౌన్‌ : దొడ్డి కొమురయ్య సాయుధ పోరాట యోధుడని మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.శ్రీపతినాయుడు కొని యాడారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా సోమవారం కళాశాల సెమినార్‌ హాల్‌లో దివంగత యోధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే.సుకుమార్‌, అధ్యాపకులు హరినాగభూషణం, సీహెచ్‌ శ్రీనివాస్‌, బిక్యానాయక్‌, పవన్‌కుమార్‌, నరేష్‌బాబు, రవి, హసీనాబీ, విజయకుమారి శంకర్‌, గోపాల్‌, రాణి తదితరులు పాల్గొన్నారు.

కేటీదొడ్డి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కేటీదొడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సుందర్‌రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Updated Date - 2023-04-03T23:14:55+05:30 IST