సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య

ABN , First Publish Date - 2023-04-03T23:51:39+05:30 IST

భూమి కోసం, భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి తెలంగాణ సాయుధ పోరాటానికి బాటలు వేసిన యోధుడు దొడ్డి కొమురయ్య జడ్పీ చైర్‌ పర్సన్‌ శాంతకుమారి అన్నారు.

సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య
కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్నజడ్పీ చైర్‌ పర్సన్‌ శాంతకుమారి

- జడ్పీ చైర్‌ పర్సన్‌ శాంతకుమారి

- కలెక్టరేట్‌లో ఘనంగా జయంతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 3: భూమి కోసం, భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి తెలంగాణ సాయుధ పోరాటానికి బాటలు వేసిన యోధుడు దొడ్డి కొమురయ్య జడ్పీ చైర్‌ పర్సన్‌ శాంతకుమారి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో సోమవారం ఆయన చిత్ర పటానికి జడ్పీ చైర్‌ పర్సన్‌ శాంతకుమారి పూల మాల వేసి నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ మహోద్యమానికి ఆద్యుడు అయ్యా డని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని ప్రభు త్వం అధికారికంగా నిర్వహించడం సంతోషించదగిన విషయమన్నారు. రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య అడుగుజాడల్లో కలిసి ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అదన పు కలెక్టర్‌ మోతీలాల్‌, డీపీఆర్వో సీతారాం, డీసీవో పత్య నాయక్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ రాంలాల్‌, జిల్లా బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి శ్రీధర్‌జీ, దళిత సంఘాల నాయకులు జెట్టి ధర్మరాజు, వంకేశ్వరం నిరంజన్‌, గూట విజయ్‌, కోళ్ల శివ, వార్డెన్‌ చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:51:39+05:30 IST