ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
ABN , First Publish Date - 2023-02-07T00:02:32+05:30 IST
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తహసీల్దార్‌లను ఆదేశించారు.

- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- ప్రజావాణికి 106 ఫిర్యాదులు
గద్వాల క్రైం, ఫిబ్రవరి 6 : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తహసీల్దార్‌లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 106 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించినవి 96 ఫిర్యాదులు ఉన్నాయి. గట్టు, ధరూర్, అయిజ, మల్దకల్, అలంపూర్ మండలాలకు సంబంధించిన గ్రామాల ప్రజలు భూ సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల తహసీల్దార్లతో మాట్లాడారు. ఆన్‌లైన్ రికార్డ్‌లను తనిఖీ చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను పంపించాలని అదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఏవో యాదగిరి, సూపరింటెండెంట్స్ రాజు, మదన్‌మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.