ధరణి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:45:16+05:30 IST

జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో తొగుట వీర క్షత్రియ సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ దేవి, నీలకంఠేశ్వరస్వామి అఖండ జ్యోతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.

ధరణి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలి
ధరణి పోర్టల్‌లో పెం డింగ్‌లో ఉన్న భూ సమస్యలన్నింటినీ వారంలోపు పరిష్కరించాలని కలె క్టర్‌ జి. రవి నాయక్‌ తహసీల్దార్‌లను ఆదేశించారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ జి. రవి నాయక్‌

- ప్రజావాణికి అధికారులందరు రావాలి : కలెక్టర్‌

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : ధరణి పోర్టల్‌లో పెం డింగ్‌లో ఉన్న భూ సమస్యలన్నింటినీ వారంలోపు పరిష్కరించాలని కలె క్టర్‌ జి. రవి నాయక్‌ తహసీల్దార్‌లను ఆదేశించారు. సోమవారం కలెక్ట రేట్‌లోని సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదిదారులతో ఆప్యాయంగా పలకరించి, ఫిర్యాదులను క్షుణ్ణంగా చదువుతూ తనదైన శైలిలో సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు లలో కొన్నింటిని తిరస్కరించారు మరికొన్నింటికి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటానని వారికి చెబుతూ సంబంధిత శాఖ అధి కారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసమని ఎవరూ దరఖాస్తు చేసుకోకూడదని, అలాంటివాటికి నేరుగా ప్రభుత్వమే నోటిఫికేషన్‌ ఇస్తుందని తెలిపారు. అలాగే ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలను పరిష్క రించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గత డిసెంబరు 31 వరకు వచ్చిన అన్నిదరఖాస్తులకు సంబంధించిన రిపోర్టులను తనకు సమర్పించాలని ఆయన ఆదేశించారు. వచ్చేవారంలోపు ధరణిలో ఉన్న అన్ని పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని, ఏ కేసునూ పెండింగ్‌లో ఉంచవద్దని ఆయన తెలిపారు. ముఖ్యంగా పీవోబీ కేసులకు సంబంధించి ఎక్కువ సమయం తీసుకోవద్దని తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యా క్రాంతం కాకుండా దృష్టిసారించాలని, ప్రభుత్వ భూములపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, స్పెషల్‌ కలెక్టర్‌ పద్మశ్రీ, జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు హాజరయ్యారు. అంతకు ముందు డీఆర్డీఏ, డీపీవో, సీపీవో, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌లు తమకు సంబంధించిన శాఖల మండలాధికారులతో సమీక్షించారు. ఈ సోమవారం వివిధ సమస్యలపై 68 ఫిర్యాదులు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు.

కోయిల్‌సాగర్‌ ఎడమ కాలువను పొడిగించొద్దని వినతి

దేవరకద్రలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఎడమకాల్వ పనులను ముం దుకు చేపట్టవద్దని పలు గ్రామాల రైతులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. 2005 సంవత్సరంలో ప్రాజెక్టు రూప కల్పన చేసినప్పటి నుంచి ఎడమకాలువను గూర కొండ గ్రామ శివారు నుంచి కౌకుంట్ల వరకు పొడిం గించారని తెలిపారు. అక్కడి నుంచి కౌకుంట్ల లోని అప్పంపల్లి, ముచ్చింతల, తిర్మలాపూర్‌ తదితర గ్రా మాలకు కాలువను పొడిగించి పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేదని తెలిపారు. పేరూరు వద్ద లిఫ్ట్‌ ఇరిగే షన్‌ మంజూరైనందున అక్కడి నుంచి తమ పంట పొలాలకు నీరు వస్తుందని రైతులు పేర్కొన్నారు. ఇకపై కోయిల్‌ సాగర్‌ ఎడమ కాలువను పొడిం గించవద్దని వివిధ గ్రామాల రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

మహవీర్‌ ఐరన్‌ పరిశ్రమ మాకు వద్దు

- కలెక్టర్‌ కార్యాలయం ముందు గుండేడ్‌ గ్రామస్థుల ధర్నా

బాలానగర్‌ మండలం గుండేడు గ్రామ సమీపంలో ఉన్న మహవీర్‌ ఐరన్‌ కంపెనీ మాకు వద్దని, ఆ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆ గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద 200 మంది గామస్థులు ధర్నా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఐరన్‌ కంపెనీ వల్ల ఏర్పడే కాలుష్యం వల్ల తమ పంటపొలాలు కాలుష్యం బారీన పడుతున్నాయని, తాగునీరు, పీల్చుకునే గాలిపైతం కలుషితం అవుతోందని పేర్కొన్నారు. దీంతో తమ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి తమ గ్రామానికి న్యాయం చేయాలని వారు కోరు తున్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2023-02-06T23:45:16+05:30 IST