బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి
ABN , First Publish Date - 2023-02-12T23:07:39+05:30 IST
తెలంగాణ రాష్ట్రం బాగు పడాలంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు.
- బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ
నారాయణపేట, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రం బాగు పడాలంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని భీమండి కాలనీలో బీజేపీ శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతు న్నారని వారికి నోబెల్ బహుమతి ఇచ్చినా తక్కువేన ని విమర్శించారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించ లేకపోయారన్నారు. రాష్ట్రానికి 80శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా రోడ్లు లేవని, మంచినీటి వసతి లేకపోగా అన్ని చేశామని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతూనే కేంద్రం సహకరించడం లేదని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పక్కనున్న ఏపీలో కేంద్రం నిధులతో 30 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారని, తె లంగాణాలో నిర్మిస్తామంటే బీజేపీకి పేరు వస్తోందని అడ్డుకుంటున్నారని విమర్శించారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు సీఎం, సీఎం బాటలో ఎమ్మెల్యేలు నడుస్తూ జిల్లాను దోచుకుంటున్నారని, ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, జీవో 69ను అడ్డుకుంటున్నారని గుర్తు చేశారు. బీజేపీ ఉద్యమాల వల్లే నేడు జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి, డాక్టర్లు వచ్చారని, రోడ్డు వెడ ల్పు జరిగిందని, భీమండి కాలనీ ఏర్పడిందని నామాజీ స్పష్టం చేశారు. ఈ కాలనీని సైతం బీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఈ శ్రమ్ కార్డులు దగ్గరుండి ఇప్పిస్తానని దీంతో పిల్లల పెళ్లీళ్లు జరిగితే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే మూడు లక్షల ఉచిత బీమా అందుతోంద న్నారు. బీజేపీని ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు నందు, మిర్చి వెంకటయ్య, మహబూబ్ అలీ, రఘు రామయ్య, రాము, చలపతి, శ్రీనివాస్, ప్రకాష్, అంబా దాస్, హన్మంత్‌రావ్, అర్జున్ పాల్గొన్నారు.