తెలంగాణ వచ్చాకే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-01-25T23:38:33+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

తెలంగాణ వచ్చాకే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

ఇటిక్యాల, జనవరి 25 : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండలంలోని వల్లూరు గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, ఐదు లక్షల రూపాయల వ్యయంతో చెన్నకేశవస్వామి ఆలయ ప్రహరీ నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. కార్యక్రమంలో సర్పంచు ఏసన్న, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గిడ్డారెడ్డి, మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సర్పంచు జయచంద్రారెడ్డి, వీరన్న, గోవర్ధన్‌రెడ్డి, సుంకన్న, శివుడు, ఎంపీటీసీ సభ్యులు చంద్రగౌడ్‌, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

విద్యుత్‌ స్తంభాలు ఇవ్వాలి

అలంపూర్‌ చౌరస్తా : అయిజ మండలంలోని ఉత్తనూరు, టీటీ దొడ్డి, రాజాపురం, భుంపూరం గ్రామాల్లో నిర్వహించే జాతరలక విద్యుత్‌ సమస్య తలెత్తకుండా, కరెంటు స్తంభాలు ఇవ్వాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ భాస్కర్‌ను అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం కోరారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. జాతరల సందర్భంగా గ్రామాల్లో విద్యుత్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ రాముడు, రాజాపురం రమేష్‌, ఉప సర్పంచు మహేష్‌, హరిగౌడు, డీఈఈ తిరుపతి పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

అలంపూర్‌ పట్టణానికి చెందిన శ్రీనువాసులుకు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కు, ఎల్‌వోసీలను బుధవారం ఎమ్మెల్యే అబ్రహాం అలంపూర్‌ చౌరస్తాలోని తన క్యాంపు కార్యాలయంలో తండ్రి సుబ్బన్నకు ఇచ్చారు.

Updated Date - 2023-01-25T23:38:34+05:30 IST