తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి

ABN , First Publish Date - 2023-06-03T00:23:42+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సా ధించామని శాసనసభ ఉపసభాపతి టి.పద్మారావుగౌడ్‌ అన్నారు.

 తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి
జాతీయ జెండాకు వందనం చేస్తున్న డిప్యూటీ స్వీకర్‌ పద్మారావుగౌడ్‌

- తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు

రాష్ట్ర బిడ్డలకే గర్వకారణం

- శాసనసభ ఉపసభాపతి పద్మారావు

- ఘనంగా ప్రారంభమైన

తెలంగాణ ద శాబ్ది ఉత్సవాలు

గద్వాల క్రైం, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సా ధించామని శాసనసభ ఉపసభాపతి టి.పద్మారావుగౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవ తరణ, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవా రం డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావుగౌడ్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అ నంతరం ప్రత్యేక వాహనంలో పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ తెలంగాణ అవతరించి తొ మ్మిది వసంతాలు పూర్తి చేసుకొని నేడు పదోయేట అడుగెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం నుంచి 22వ తేదీవరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రతీరోజు ఒక కార్యక్రమం చొప్పున జరుపుకోవడానికి నిర్దేశించిందన్నారు. తెలంగాణ ప్రాంతం రాష్ట్ర అవతరణ నాటికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేదని తీవ్రమైన విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలయిందన్నారు. సాగునీటి రంగంలో జ రిగిన అన్యాయం వలన తెలంగాణ పంటపొలాలు పడావు పడిన దుస్థితి నెలకొన్నదన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. మొత్తం గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఈ దుర్బర పరిస్థితులను అధిగమించేందుకు అన్ని రంగాల్లో పునర్మిర్మాణ ప్రక్రియను ప్రారంభించి, అభివృద్ధి సంక్షేమాలకు ప్రాధాన్యతనిస్తూ మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ తొమ్మిడి ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగమన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండేవిధంగా మనం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితా లను ఇచ్చాయన్నారు. గతం సృష్టించిన సమస్యల విలయంలోంచి బయట పడటమే కాకుండా నిరంతర ప్రగతిశీల రా ష్ట్రంగా తెలంగాణ యావత్‌ ప్రపం చం దృష్టిని ఆకర్షిస్తున్నదన్నారు. ఇది దశాబ్ద కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నామన్నారు. నేడు తె లంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మ నందరికి గర్వకారణమన్నారు. తెలం గాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో రైతుబంధు, రైతు భీమా రైతులకు ఎంతో దో హదపడిందన్నారు. తెలంగాణ కోసం అసువులు బాసిన కుటుంబసభ్యుల ను సత్యరించారు. అనంతరం బాలభవన్‌, ప్రగతి విద్యానికేతన్‌ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు మెమోంటోలను అంద జేశారు. గద్వాల చరిత్రను నలుమూలల చాటిన గద్వాల ఫుట్‌బాల్‌ క్రీడాకారులను అభినందించారు. అనంతరం వివిధ శాఖలు ఏ ర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, ఎస్పీ సృజన, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, గ ద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్లకృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రామన్‌గౌడ, మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌గౌడ్‌, ఆర్డీవో రాములు, అధికారులు తదితరులున్నారు. అంతకుముందు స్మృతి వనంలో అమరవీరుల స్తూపం వద్ద ఉపసభాపతి, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు నివాళి అర్పించారు.

ఉపాధి ఉద్యోగులకు పే స్కేల్‌ వర్తింప చేయాలి

గద్వాల: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్‌ వర్తింపచేయాలని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు ఉపాధి ఉద్యోగులతో కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం కన్వీనర్‌ రామలింగేశ్వర ప్రసాద్‌, విద్యాధర్‌, రా మకృష్ణ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:23:42+05:30 IST