‘దళితబంధు’ వివరాలు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2023-02-21T23:21:28+05:30 IST

దళితబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక చేయూతతో లబ్ధిదారులు ఆర్థికంగా, సామాజికంగా ఎ దిగేందుకు చేస్తున్న వ్యాపారాల వివరాలను దళిత బంధు మొబైల్‌యాప్‌లో వారి ఫొటోలు, వివరాలను రానున్న నాలుగు రోజుల్లో నమోదు చేయాలని కలెక్టర్‌ పి.ఉ దయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

   ‘దళితబంధు’  వివరాలు నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : దళితబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక చేయూతతో లబ్ధిదారులు ఆర్థికంగా, సామాజికంగా ఎ దిగేందుకు చేస్తున్న వ్యాపారాల వివరాలను దళిత బంధు మొబైల్‌యాప్‌లో వారి ఫొటోలు, వివరాలను రానున్న నాలుగు రోజుల్లో నమోదు చేయాలని కలెక్టర్‌ పి.ఉ దయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమా వేశమందిరంలో ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, అధికారులకు ప్రత్యేక మొ బైల్‌యాప్‌లో ఫొటో అప్‌లోడ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాలు పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన చారకొండ మండలంలోని 1708 యూనిట్లకు 170కోట్ల రూపాయల నిధుల తో గ్రౌండింగ్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వివిధ రకాల వ్యాపారాలు, వివిధ రకాల వాహనాల ద్వారా ప్రతీ నెలా ఎం త ఆదాయం వస్తున్నది, జీవన స్థితిగతుల్లో ఏమైనా మార్పు వచ్చిందా వారి ఆదా య వివరాలను సేకరించి మొబైల్‌యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ లబ్ధిదారున్ని వివరాలు నమోదు చేసే బాధ్యత ఎంపీడీవోలదేని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాంలాల్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.రమేష్‌, డీఆర్‌డీఏ ఏవో నటరాజ్‌, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో భాగ్యలక్ష్మీ, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:21:30+05:30 IST