130 మామిడి చెట్ల నరికివేత
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:22 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ రెవెన్యూ శివారులో ఓ రైతుకు చెందిన మూడెకరాల మామిడి చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, బాధిత మహిళా రైతు శంకరమ్మ సోమవారం పోలీస్ స్టేషన్‌లో అనుమానితులపై ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
కోడేరు, డిసెంబరు 18: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ రెవెన్యూ శివారులో ఓ రైతుకు చెందిన మూడెకరాల మామిడి చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, బాధిత మహిళా రైతు శంకరమ్మ సోమవారం పోలీస్ స్టేషన్‌లో అనుమానితులపై ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఎత్తం గ్రామానికి చెందిన బోయ శంకరమ్మ తనకున్న రెండెకరాల పొలంలో 170 మామిడి చెట్లను ఏడాది కింద నాటి, పెంచుతున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 130 చెట్లను నరికేశారు. సోమవారం పొలం వద్దకు వెళ్లిన శంకరమ్మ నరికిన చెట్లను చూసి రోదిస్తూ, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విచారణ చేసి, చెట్లను నరికేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.