హరితహారం చెట్ల నరికివేత
ABN , First Publish Date - 2023-05-05T23:19:04+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహా రం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది.
శ్రీరంగాపురం, పెబ్బేరు రూరల్, మే 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహా రం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. హరితహారం పథకం కోసం ప్రతీ యేటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడు తున్నా అధికారుల నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పూర్తిగా విద్యుత్ లైన్ కిందనే అధికంగా ఉన్నాయి. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి.. పెరిగితే విద్యుత్ లైన్ వలన ప్రమాదం ఉందా అనే ఆలోచనే లేకుండా ఆ పూటకు మొక్కలు నాటి లెక్కలు రాసుకున్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యం మొక్కలు పెంచాలి అని అధికారులు గుర్తించడం లేదు.. అధికారుల లక్ష్యం ఒక్కటే మొక్కలు నాటాలి లెక్కలు రా యాలి.. ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటాయో గుర్తించడం లేదు. అధికారుల నిర్ల క్ష్యంతో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. శ్రీరంగాపురం మండలంలో శ్రీరంగాపురం నుంచి వెంకటాపూర్ వరకు నాటిన మొక్కలు రహదారి నిర్మాణంలో పూర్తిగా తొలగించారు. అదేవిధంగా శ్రీరంగాపు రం, కంబాలాపురం వైపు రంగసముద్రం వెనుక భాగంలో అధికారులు కరెంటు వైర్ల కింద మొక్క లు నాటారు. ఈ మొక్కలు ఏపుగా పెరిగి కరెంట్ వైర్లకు తగిలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ శాఖ వారు ఆ చెట్లను నరికి వేస్తున్నారు. పెబ్బేరు సమీపంలో కరెంటు వైర్ల కింద ఉన్న చెట్లను నరికేశారు. అధికారులు వారి టార్గెట్ పూర్తి చేసు కునేందుకు రోడ్డుకు సమీపంలో, విద్యుత్ వైర్ల కింద మొక్క లు నాటి చేతులు దులుపుకుంటు న్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతో పాటు ప్రజా ధనం వృథా అవుతోందని పలువురు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొక్కలు నాటే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని మొక్క లు నాటితే హరితహారం కార్యక్రమం విజయ వంతం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.