సీపీఆర్‌తో ప్రాణాన్ని కాపాడొచ్చు
ABN , First Publish Date - 2023-04-11T23:40:33+05:30 IST
అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం ద్వారా మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చని డాక్టర్ రాజు వివరించారు.
- శిక్షణను పరిశీలించిన జడ్జి కనకదుర్గ
గద్వాల క్రైం, ఏప్రిల్ 11 : అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం ద్వారా మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చని డాక్టర్ రాజు వివరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్‌లో జరిగిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్జి కనకదుర్గ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు సీపీఆర్ చేసే విధానాన్ని జిల్లా జడ్జితో పాటు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులకు వివరించారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని 15 సెకన్లలో 30సార్లు గుండెపై ఒత్తాలని, రెండుసార్లు నోటి ద్వారా శ్వాస అందించాలన్నారు. ఇలాచేస్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉందన్నారు. సీనియర్ సివిల్ జడ్జి గంట కవితాదేవి, బార్ అసోసియేషన్ సభ్యులు, డీఎంహెచ్‌వో సిబ్బంది ఉన్నారు.