Share News

అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:58 PM

నియోజకవర్గ అభి వృద్ధికి సహకరించాలని, కలసికట్టుగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సో మవారం మండల మహిళా సమాఖ్య భవనంలో ఎంపీపీ రఘుప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అభివృద్ధికి సహకరించాలి
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

- అవినీతి రహిత పాలన అందిద్దాం

- కలిసికట్టుగా ముందుకెళ్దాం

- మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెద్దమందడి, డిసెంబరు 18: నియోజకవర్గ అభి వృద్ధికి సహకరించాలని, కలసికట్టుగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సో మవారం మండల మహిళా సమాఖ్య భవనంలో ఎంపీపీ రఘుప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికా రులు నివేదికలు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ప్రొటోకాల్‌కు మాత్ర మే ఎమ్మెల్యేనని ప్రజలకు మాత్రం సేవకుడిగా ఉం టానని, అవినీతి రహిత పాలన అందిస్తూ ముందు కు సాగుదామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అవినీతి పాలన కొనసాగిందని, వాటికి ఇప్పుడు చర మగీతం పాడాలని, పైరవీకారులకు స్వస్తి పలకాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లలో అవినీతిని సహించబోనన్నారు. ఇక నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ కాదు ప్రజాభవన్‌ అని ఏ పార్టీ వారైనా నిర్భయంగా పనిచేయించుకోవచ్చన్నా రు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుం డా అమలు చేస్తామని, వనపర్తి టూ పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతామని, ప్రభుత్వ సంక్షే మ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధు లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చ రించారు. గొర్రెల పెంపకం దారులకు రావాల్సిన గొర్రెల దాన పక్కదారి పట్టిందని, దానిపై విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. గత పదేళ్లు వనపర్తి నియోజక వర్గం లో ప్రొటోకాల్‌ అంటూ లేకుండా పోయిందని వార్డు మెంబర్‌ మొదలుకొని సర్పంచు, మునిసిపల్‌ చైర్మన్‌ వరకు ఒకరి ఆదిపత్యంలోని పరిపాలన కొనసాగిం దని, ఇక నుంచి స్థానిక సంస్థలను బలోపేతం చేయ డంతో పాటు ప్రజా ప్రతినిధులకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కొంత కాలంగా గ్రామాలలో ఎస్‌ఎఫ్‌సీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవ డంతో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారని, ఎస్‌ఎఫ్‌ిసీ నిధులతో చేపట్టి న పనులకు సంబంధించిన ఎంబీలను అధికారులు, ఎంపీడీవో సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. గతంలో పెద్దమందడికి ఆర్టీసీ బస్సు రాకుండా ఉండే దని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వారం రోజుల్లోనే పెద్దమందడి మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సును పునః ప్రారంభించామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలి పించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతు న్నానని అన్నారు. అదేవిధంగా మద్దిగట్ల, మోజర్ల జిల్లా ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రఘు పతిరెడ్డి, ఎంపీడీవో అఫ్జల్‌, సర్పంచులు వెంకటస్వా మి, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌యాదవ్‌, రాధాకృష్ణ, జయంతి, సిద్దయ్య, సతీష్‌ తదితరులు ఉన్నారు.

అభివృద్ధికి అధికారులే కీలకం : ఎమ్మెల్యే

గోపాల్‌పేట : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికారులే కీలకమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీ వో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్‌, ఉజ్వల శాఖ, చిన్న నీటి పారుదల శాఖ, ఫారెస్టు, పశువైద్య, ఉపాధి, విద్య, వంటి శాఖలకు చెందిన అధికారులు చేసిన పనుల పై వివరణ ఇచ్చారు. వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మండల కేంద్రంలోని బండపల్లి స్కూల్లో ముక్క పట్టిన బియ్యాన్ని వండుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కలగజేసుకుని చిన్న పిల్లలకు ఇలాంటి బియ్యాన్ని ఎలా వండుతారని ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృత్తం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... మండలం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అధికారుల చేతుల్లోనే ఉంటుందని, అధికారులు 38 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, ఎమ్వార్వో శ్రీనివాసులు, ఎంపీడీవో హుస్సేనప్ప, ఎంపీపీ సంధ్య యాదవ్‌, జడ్పీటీసీ భార్గవి, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు రఘు, ఆయా గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:58 PM