‘విజయభేరి’కి తరలివెళ్లిన కాంగ్రెస్‌ నాయులు

ABN , First Publish Date - 2023-09-17T23:33:09+05:30 IST

హైదబాద్‌లోని తుక్కుగూడలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన విజయభేరి సభకు ఆ పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు.

‘విజయభేరి’కి తరలివెళ్లిన కాంగ్రెస్‌ నాయులు
మక్తల్‌ నుంచి విజయభేరి సభకు తరలివెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మక్తల్‌, సెప్టెంబరు 17 : హైదబాద్‌లోని తుక్కుగూడలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన విజయభేరి సభకు ఆ పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మక్తల్‌ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, నాయకులు గవినోళ్ల బాలక్రిష్ణారెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, పోలీస్‌ చంద్రశేఖర్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మక్తల్‌ నియోకవర్గం నుంచి దాదాపు 500 వాహనాల్లో తరలివెళ్లారు. వెళ్లిన వారిలో గవినోళ్ల గోపాల్‌రెడ్డి, రవికుమార్‌ యాదవ్‌, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఉజ్జెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాతింటి విష్ణువర్దన్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌, గణేష్‌కుమార్‌, కట్ట సురేష్‌కుమార్‌ గుప్తా, యజ్ఞేశ్వర్‌రెడ్డి, గోలపల్లి నారాయణ, రవి ఉన్నారు.

Updated Date - 2023-09-17T23:33:09+05:30 IST