Share News

శ్రీశైలానికి కాంగ్రెస్‌ నాయకుల పాదయాత్ర

ABN , First Publish Date - 2023-12-01T22:43:39+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అలంపూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సంపత్‌కుమార్‌ భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ అలంపూర్‌ మండల పరిధిలోని లింగనవాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు.

శ్రీశైలానికి కాంగ్రెస్‌ నాయకుల పాదయాత్ర
శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్ర చేపట్టిన నాయకులు

అలంపూర్‌, డిసెంబరు 1 : కాంగ్రెస్‌ పార్టీ అలంపూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సంపత్‌కుమార్‌ భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ అలంపూర్‌ మండల పరిధిలోని లింగనవాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం వారు అలంపూర్‌కు చేరుకొని జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకుని, 101 టెంకాయలు కొట్టారు. అనం తరం సగినల రాజు ఆధ్వర్యంలో అలంపూర్‌ పట్టణంలోని గాంధీ చౌక్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్య క్రమంలో నాయకులు గోకారి, శ్రీధర్‌, టి.మహేష్‌, ఇస్మాయిల్‌, పాండు, వెంకటేష్‌, రాజశేఖర్‌, పెద్ద తిప్పన్న, స్వాములు, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-01T22:43:41+05:30 IST