దయాకర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
ABN , First Publish Date - 2023-06-16T23:17:08+05:30 IST
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచిం తకుంట మండలం పర్కాపూర్ గ్రామంలోని దయాకర్‌రెడ్డి స్వగృహానికి రేవంత్‌రెడ్డి వచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శ
మహబూబ్‌నగర్,(ఆంరఽధజ్యోతి)/సీసీకుంట, జూన్ 16: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచిం తకుంట మండలం పర్కాపూర్ గ్రామంలోని దయాకర్‌రెడ్డి స్వగృహానికి రేవంత్‌రెడ్డి వచ్చారు. దయాకర్‌రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డిని, కుమారులు సిద్ధార్థ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డిని రేవంత్ ఓదార్చారు. అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ఊకచెట్టు వాగులో ఇసుక అక్రమంగా తరలించకుండా చూడాలని, ఆత్మకూర్ పట్టణంలోని బాలబ్రహ్మేశ్వరస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని తన భర్త సూచించారని, ఆయన ఆశయం కోసం తాను పని చేస్తానని సీతా దయాకర్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి తెలిపారు. వీటిపై మరో సారి కూడా కలిసి మాట్లాడుదామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి బయటికి రాగానే రేవంత్ సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, సంపత్ కుమార్, వేం నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా నాయకురాలు శోభారాణి, ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ సం యుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీహరి, శివకు మార్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వోబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ ఉన్నారు. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరామర్శించేదుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.