ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-09-04T22:37:03+05:30 IST

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరి ష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, సెప్టెంబరు 4 : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరి ష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నారాయణ పేట కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భం గా కలె క్టర్‌ మాట్లాడుతూ అధికారులు ఫిర్యాదులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతీ రైతుకు రుణమాఫీ అందేలా చూడాలి

జిల్లాలోని ప్రతీ రైతుకు రుణమాఫీ నగదు అందేలా చూ డాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీసీ ద్వారా కలెక్టర్లతో సమీక్షించి, పలు సూచనలు చేశారు. వీసీలో కలెక్టర్‌ శ్రీహర్ష, డీఆర్డీఏ గోపాల్‌ నాయక్‌, ఏవో నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T22:37:03+05:30 IST