పేపర్‌ లీకేజీకి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2023-03-18T23:13:00+05:30 IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌పై సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాదర్‌ పాషా డిమాండ్‌ చేశారు.

పేపర్‌ లీకేజీకి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాదర్‌

వనపర్తి టౌన్‌, మార్చి 18: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌పై సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాదర్‌ పాషా డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పేపర్‌ లీక్‌ నిందితులను కఠినంగా శిక్షించాలని, నోటిఫికేషన్‌ రద్దు ద్వారా నష్టపోయిన ప్రతీ నిరుద్యోగ అభ్యర్థికి ప్రభుత్వం లక్షరూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బోర్డును ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. ప్రతీ సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి రూ. 3016 ప్రతీ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని అన్నారు. గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌పై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ నాయకులు ఎండీ షఫీ, బాలకృష్ణ, రఘునాయుడు, పికిలి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:13:00+05:30 IST