సివిల్‌ ఫిర్యాదులు కోర్టులో పరిష్కరించుకోవాలి

ABN , First Publish Date - 2023-06-26T23:15:57+05:30 IST

సివిల్‌ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర రావు సూచించారు.

సివిల్‌ ఫిర్యాదులు కోర్టులో పరిష్కరించుకోవాలి

- డీఎస్పీ వెంకటేశ్వర రావు

- పోలీస్‌ ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

నారాయణపేట, జూన్‌ 26: సివిల్‌ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర రావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్‌ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించు కోవాలన్నారు. బాధితులు తీసుకువచ్చే ఎలాంటి ఫిర్యాదులు అయినా పెండింగ్‌లో ఉంచకుండా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని సంబంధిత పోలీస్‌ అదికారులను ఆదేశించారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకొని పీఎస్‌ల పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు సైబర్‌ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర సమయంలో డయల్‌ 100కు లేదా 1930కి కాల్‌ చేసి సమాచారమివ్వాలని డీఎస్పీ కోరారు.

మూడు సెల్‌ఫోన్లు రికవరీ..

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా మూడు సెల్‌ఫోన్లు రికవరీ చేసినట్లు సీఐ రవిబాబా తెలిపారు. సోమవారం బాధితులకు సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నారాయణపేట పీఎస్‌ పరిధిలో లక్ష్మీపల్లికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌, శాసన్‌పల్లికి చెందిన అయ్యప్ప , బండగొడకు చెందిన టీ. శ్రీను సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నారు. నారాయణపేట పోలీసుల సహాయంతో సీఈఐఆర్‌ నూతన పోర్టల్‌లో అప్లై చేయగా క్రైం పోలీసులు 12 రోజుల వ్యవధిలో రికవరీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సురేష్‌, క్రైం సిబ్బంది శివ, అంజి, రాము బాధితులు ఉన్నారు.

Updated Date - 2023-06-26T23:15:57+05:30 IST