కొత్తకోట దయాకర్‌రెడ్డికి ప్రముఖుల ఘన నివాళి
ABN , First Publish Date - 2023-06-24T23:25:14+05:30 IST
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఈనెల 13న మృతిచెందగా, శనివారం ఆయన స్వగ్రామంలో ద్వాదశ దినకర్మ నిర్వహించారు.
- కుటుంబ సభ్యులకు పరామర్శ
చిన్నచింతకుంట, జూన్ 24 : మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఈనెల 13న మృతిచెందగా, శనివారం ఆయన స్వగ్రామంలో ద్వాదశ దినకర్మ నిర్వహించారు. దీనికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, పాల్గొని, దయాకర్‌రెడ్డికి ఘనంగా నివాళ్లర్పించారు. ఆయన చిత్రపటానికి పూలుజల్లి, నివాళ్లర్పించారు. మక్తల్, దేవరకద్ర, నారాయణపేట తదితర నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దయాకర్‌రెడ్డి అమర్ రహే.. దయాకర్‌రెడ్డి అమర్ రహే అంటూ ఎంతో బాధాతప్త హృదయాలతో అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దయాకర్‌రెడ్డి సతీమని సీతాదయాకర్‌రెడ్డి, తనయులు కొత్తకోట సిద్దార్ధరెడ్డి, కార్తీక్‌రెడ్డి, అల్లుడు జగదభిరాంరెడ్డిలతో పాటుగా కోడళ్లను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. దయాకర్‌రెడ్డితో గతంలో ఉన్న అనుబంధాలను వారు గుర్తుకు చేసుకుని, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉదయం నుంచి పర్కాపూర్ గ్రామంలోని దయాకర్‌రెడ్డి నివాసం జనంతో కిటకిటలాడింది. పరామర్శించిన వారిలో మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి, నాయకులు కొత్వాల్, దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీటీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నర్సిహులు, మోపతయ్య, నాయకులు రాఘవ, సంస్థానాధీశులు శ్రీరాంభూపాల్, బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్, సినీ నిర్మాత బసిరెడ్డి, పీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడు, బీజేపీ రాష్ట్ర నాయకులు సుదర్శన్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులుతో పాటు ఆయా మండలాలకు అభిమానులు, అధికారులు, కార్యకర్తలు దయాకర్‌రెడ్డికి నివాళ్లర్పించారు.