పశువుల పట్టివేత

ABN , First Publish Date - 2023-03-30T23:42:42+05:30 IST

జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుం డా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పశువుల పట్టివేత
జడ్చర్లలో కంటైనర్‌లో కిక్కిరిసి ఉన్న పశువులు

- వైద్య పరీక్షల అనంతరం గోశాలకు తరలింపు

జడ్చర్ల, మార్చి 30 : జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుం డా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పెబ్బేరుకు ఎలాంటి అనుమతు లు లేకుండా 32 ఎద్దులను కంటైనర్‌లో తరలిస్తున్నారు. కంటైనర్‌లో గోవుల ను తరలిస్తున్నారన్న అనుమానంతో కొందరు డయల్‌ 100 కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని ఎస్‌ఐ లు లెనిన్‌, ఖాదర్‌లతో కలిసి తనిఖీలు చేపట్టి ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పశువుల తరలింపు ప్రక్రియలో పశువుల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంచాలని, అందుకు భిన్నం గా కంటైనర్‌లో 32 పశువులు కిక్కిరిసి ఉంచారు. యానిమల్‌ యాక్ట్‌కు విరుద్ధంగా పశువులను తరలిస్తున్నారని సీఐ వివరించారు. కంటైనర్‌ను జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి, మండల పశువైద్యాధికారులతో పశువుల కు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం హన్వాడ మండ లం చిన్నదర్పల్లి గ్రామ శివారులోని గోశాలకు తరలించి నట్లు వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండ పశువులను తరలిస్తున్న లారీ యజమాని, డ్రైవర్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు.

Updated Date - 2023-03-30T23:42:42+05:30 IST