ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2023-03-05T23:03:37+05:30 IST

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంట నుంచి మధాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు.

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
పరీక్ష కేందాన్ని పర్యవేక్షిస్తున్న ఫ్లోరెన్స్‌రాణి

ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాల కోసం..

పర్యవేక్షించిన రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఫ్లోరెన్స్‌రాణి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 5: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంట నుంచి మధాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను అర గంట ముందే పరీక్ష హాల్‌లోకి అనుమతించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యలు ఏర్పాటు చేశారు. ఇంటర్‌ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13,121 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,467 మంది హాజరయ్యారు. 654 మంది గైర్హాజరయ్యారు. డిగ్రీకి సంబంధించి తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,333 మంది విద్యార్థులకుగాను 3,106 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలమూరు రీజియన్‌ పరిధిలో ఇంటర్‌ విద్యార్థులు 6,993 మంది హాజరుకావాల్సి ఉండగా, 6,617 మంది, డిగ్రీ విద్యార్థులు 1,915 మందికి గాను 1,790 మంది హాజరయ్యారు. గద్వాల, ఇటిక్యాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను గురుకులాల రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ ఫ్లోరెన్స్‌ రాణి పర్యవేక్షించారు.

Updated Date - 2023-03-05T23:03:37+05:30 IST