బోటు ప్రయాణానికి బ్రేక్
ABN , First Publish Date - 2023-03-02T23:55:52+05:30 IST
కృష్ణానదిపై బోటు ప్రయాణం రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఎంతో దూరాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బోటు ప్రయాణం పర్యాటకులకు సైతం కనువిందు చేస్తోంది. తెలంగాణలోని సోమశిల నుంచి ఆంధ్రాలోని సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే బోటు ప్రయాణమైతే కేవలం ఆరు కిలోమీటర్ల దూరమే అవుతుంది. అదే రోడ్డు మార్గాన వెళ్తే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. 70 రోజులుగా బోటు ప్రయాణానికి బ్రేక్ పడటంతో ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోటు ప్రయాణం కొనసాగిం చేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కృష్ణానదిపై 70 రోజులుగా నిలిచిన మర బోటు ప్రయాణం
20 ఏళ్లుగా కొనసాగుతున్నా ఇప్పుడే ఆంక్షలు ఎందుకు?
ఏపీ ప్రజాప్రతినిధులే కారణమా?
కృష్ణానదిపై బోటు ప్రయాణం రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఎంతో దూరాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బోటు ప్రయాణం పర్యాటకులకు సైతం కనువిందు చేస్తోంది. తెలంగాణలోని సోమశిల నుంచి ఆంధ్రాలోని సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే బోటు ప్రయాణమైతే కేవలం ఆరు కిలోమీటర్ల దూరమే అవుతుంది. అదే రోడ్డు మార్గాన వెళ్తే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. 70 రోజులుగా బోటు ప్రయాణానికి బ్రేక్ పడటంతో ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోటు ప్రయాణం కొనసాగిం చేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కొల్లాపూర్, మార్చి 2: రెండు తెలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా పారుతున్న కృష్ణానదిపై తెలంగా ణ, ఆంధ్రవాసులు 20 సంవత్సరాలుగా మర బోటు పై రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్రాలు వేరైనా తామంతా తెలుగు వారమే అనే అప్యాయత, అను బంధాన్ని చాటుతూ వచ్చారు. కృష్ణానది మీదుగా మర బోటు ప్రయాణంపై ఆంధ్ర ప్రజా ప్రతినిధుల కన్ను పడడంతో 70 రోజులుగా బోటు ప్రయాణానికి బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని సోమశిల గ్రామా నికి చెందిన కొందరు మరబోటు ద్వారా ప్రయాణి కులను సోమశిల నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని సంగ మేశ్వరానికి చేర్చుతూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణా నదిపై మరబోటు తిప్పేందుకు 20 సంవత్సరాలుగా ప్రతియేటా టెండర్ల ద్వారా అనుమతి దక్కించుకొని మరబోట్లు నడుపుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా సోమశిల ఘాట్ నుంచి మరబోటు ప్రయాణం అనుమతిని రూ.60 లక్షలకు దక్కించుకు న్నారు. ఈ విషయం తెలిసిన ఆంరఽధాలోని అధికార పార్టీలోని ఒక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు తాము కూడా లక్షలు ఖర్చుచేసి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యామని, మాకు కూడా కొంత నగదు చెల్లి స్తేనే కృష్ణానదిపై తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుకు రావాలని ఆంక్షలు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. అంత వరకు బోటు ప్ర యాణానికి అనుమతించేదిలేదని హెచ్చరిస్తున్న ట్లు తెలిసింది. 20 ఏండ్లుగా సోమశిల గ్రామానికి చెంది న 60 మత్స్యకార కుటుంబాలు సోమశిల నుంచి సంగమేశ్వరం వరకు మరబోటు నడుపుతూ ఉన్నారు. మరబోటు ప్రయాణం చేసే ఒక్కొ క్కరి నుంచి టికెట్ రూపంలో రూ.150 వ సూలు చేసి అందులో రూ.30 సంగమేశ్వరం ఆలయం వద్ద నివసిం చే 10 కుంటుంబాల జీవనోపాధి కోసం, ఘాట్ అభివృద్ధి కోసం ఇస్తూ వచ్చారు. పంచాయతీ ప్రారంభం అయినప్పటి నుంచి సోమ శిల నుంచి సంగమేశ్వరం వరకు ఆరు కిలో మీటర్ల ప్రయాణం ఉండగా ఆంధ్రా నాయకులు దాని మూడు కిలో మీటర్లకు కుదించి సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకు మాత్ర మే తెలంగాణ మరబోటు రావాలని, అక్కడి నుంచి తమకే సంబంధమని, సిద్ధేశ్వరం దాటి తెలంగాణ మరబోటు నడవ కూడదని, సిద్ధేశ్వరం నుంచి రోడ్డు మార్గం లేదా మరబోటు ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ప్రయాణికులను చేరవస్తారని, సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన కొంత మందిని ముందుకు పెట్టి ఆంధ్రాలో అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు. దీంతో కృష్ణానదిపై రాకపోకలు నిలి చిపోవడంతో తెలంగాణ వాసులు అత్మకూరు, నంది కొట్కురు, నంద్యాల వెళ్లే ప్రయాణికులు కొల్లాపూర్ నుంచి రోడ్డు మార్గాన ప్ర యాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు అనుసంధా నంగా ఉన్న సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం తెలం గాణ ప్రాంత భక్తులు కోల్పోతున్నారు. జఠిలంగా మారుతున్న నదీ ప్రయా ణ సమస్యను ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే పరిష్కరించి ఉమ్మడి రాష్ట్ర ప్రయాణికులకు, పర్యాటల అవస్థలను తీర్చాలని పలువురు కోరుతున్నారు.