భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ

ABN , First Publish Date - 2023-08-22T23:31:46+05:30 IST

శ్రావణమాసం పురస్కరిం చుకొని మండలంలోని ఖానాపూర్‌, బిజినేపల్లి, పాలెం, వెల్గోండ, గుడ్లనర్వ, వడ్డెమాన్‌ తదితర గ్రామాల్లో పొచమ్మ బోనాల పండుగ మంగళవారం ఘనంగా నిర్వహించారు.

 భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ
అచ్చంపేటలో బోనంతో ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమల, మహిళలు

- పోచమ్మకు నైవేద్యం

సమర్పించిన భక్తులు

బిజినేపల్లి, ఆగస్టు22 : శ్రావణమాసం పురస్కరిం చుకొని మండలంలోని ఖానాపూర్‌, బిజినేపల్లి, పాలెం, వెల్గోండ, గుడ్లనర్వ, వడ్డెమాన్‌ తదితర గ్రామాల్లో పొచమ్మ బోనాల పండుగ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎదురుతో చేసిన బుట్టిలో వారం రోజు ల పాటు పెంచిన విత్తనాల మొలకల బుట్టితో పాటు మేకలు, కోళ్లు, నైవేద్యం పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఖానాపూర్‌లో బొడ్డురాయి నుంచి సా మూహికంగా పోచమ్మ గుడి వరకు బోనాల ఊరే గింపులో బీజేపీ కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే ఉమానాథ్‌ కొటియాన్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెడనూరి దిలీ పాచారి పాల్గొన్నారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశా రు. ఈసందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యే కొటియాన్‌ మా ట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృ తి, ఆచార వ్యవహారాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని, బోనాల ఊరేగింపులో పాల్గొనడం ఎంతో సంతోషం కల్గించిందన్నారు. వారి వెంట బుసి రెడ్డి సుధాకర్‌ రెడ్డి, అతినారపు తిరుపతయ్య, మట్ట వెంకట్రాములు, కావలి రాములు, మలిశెట్టి వెంకట్‌ రెడ్డి, కపిలవాయి శేఖర్‌, శరవంద ఉన్నారు.

దేవునితిర్మలాపూర్‌లో ..

పెద్దకొత్తపల్లి : మండలంలోని వివిధ గ్రామాలల్లో మంగళవారం బోనాల పండుగ వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని దేవుని తిర్మలాపూర్‌, కల్వకోల్‌, నక్కలపల్లి, గ్రామాల్లో మహి ళలు బోనం కుండలను అలంకరించి తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆయా గ్రామాల్లోని పోచమ్మ దేవతల దగ్గరకు చేరుకుని నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పం చు వి.సత్యం, రాధిక, ఉజ్వల, ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి, సీపీఐ నాయకుడు బి.శ్రీనివాసులు మహిళలు, యువ తీయువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అచ్చంపేట పట్టణంలో..

అచ్చంపేట టౌన్‌: పట్టణంలోని పాత బజారులో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా మహిళలు బోనాన్ని ఎత్తుకొని ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తు ల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు నిర్వహిం చారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమల మహిళలతో కలిసి బోనం ఎత్తారు. నైవేద్యం అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు అమ్మవారిని దర్శించు కున్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ నర్సిం హ గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

పెంట్లవెల్లి మండలంలో..

పెంట్లవెల్లి : మండలంలోని గోప్లపూర్‌, పెంట్లవెల్లి, గ్రామాల్లో పోచ్చమ్మ బోనాలు ఘనంగా నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఊరేగింపుగా గుడి దగ్గరకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2023-08-22T23:31:46+05:30 IST